Salaar 1st Day Collections: బాక్సాఫీస్ వద్ద ‘సలార్’ ఊచకోత.. ఫస్ట్ డే ప్రభాస్ మాస్ రికార్డ్స్ ..
డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇన్నాళ్లకు మళ్లీ ప్రభాస్ మాస్ విశ్వరూపం చూసిన రెబల్ స్టార్ ఫ్యాన్స్ డైరెక్టర్ నీల్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సలార్ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమార్, జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తోనే హైప్ క్రియేట్ చేసిన మేకర్స్.. ఇక నిన్న విడుదలైన మూవీతో ఫ్యాన్స్ అంచనాలను బ్రేక్ చేశారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ సినిమా ‘సలార్’. కేజీఎఫ్ 1, 2 సినిమాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇన్నాళ్లకు మళ్లీ ప్రభాస్ మాస్ విశ్వరూపం చూసిన రెబల్ స్టార్ ఫ్యాన్స్ డైరెక్టర్ నీల్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సలార్ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమార్, జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తోనే హైప్ క్రియేట్ చేసిన మేకర్స్.. ఇక నిన్న విడుదలైన మూవీతో ఫ్యాన్స్ అంచనాలను బ్రేక్ చేశారు. ఈ సినిమాకు సౌత్ టూ నార్త్ భారీ రెస్పాన్స్ రాగా.. థియేటర్లలో అభిమానుల చేసిన హంగామా గురించి చెప్పక్కర్లేదు.
ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి. మొదటిరోజే రికార్డ్ బ్రేక్ చేశాడు ప్రభాస్. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 175 కోట్లు కలెక్షన్స్ వచ్చినట్లుగా సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. అంచనాల ప్రకారం ఈ సినిమాకు దేశవ్యాప్తంగా మొదటి రోజు రూ.95 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఓవైపు షారుఖ్ నటించిన డంకీ సినిమా అత్యధిక థియేటర్లలో ప్రదర్శన జరుగుతున్నప్పటికీ సలార్ మాత్రం వసూళ్ల రికార్డ్స్ బ్రేక్ చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సలార్ సినిమా దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసింది. తెలంగాణ, ఏపీలో మొత్తం 88.93% ఆక్యుపెన్సీని కలిగి ఉంది. అటు కర్నాటక, కేరళలోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది. అక్కడ మొదటి రోజే ర.12, రూ. 5 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సలార్ ఓపెనింగ్ కలెక్షన్స్.. షారుఖ్ నటించిన జవాన్, పఠాన్ రణబీర్ నటించిన యానిమల్ సినిమా వసూళ్లను బ్రేక్ చేసింది. ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. పఠాన్ సినిమా మొదటి రోజు కేవలం రూ.57 కోట్లు రాబట్టింది. అలాగే జవాన్ రూ.75 కోట్లు.. యానిమల్ రూ.63 కోట్లు ఓపెనింగ్స్ రాబట్టాయి. ఈ ఏడాది మొదటి రోజే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సలార్ నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో విజయ్ దళపతి నటించిన లియో సినిమా నిలిచింది. ఇప్పటికే దేశంలో మొదటిరోజు అత్యధిక ఓపెనింగ్స్ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఆర్ఆర్ఆర్. మొదటి రోజే రూ.223 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆతర్వాత కేజీఎఫ్ 2 రూ.165 కోట్లు రాబట్టింది. ఇప్పుడు కేజీఎఫ్ రికార్డ్ ను సలార్ బ్రేక్ చేసింది. త్వరలోనే సలార్ 2 పార్ట్ పట్టాలెక్కనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.