Megastar Chiranjeevi: ‘సలార్’ సినిమాపై మెగాస్టార్ రివ్యూ.. ప్రభాస్, ప్రశాంత్ నీల్ గురించి ఏమన్నారంటే..

ట్రైలర్, టీజర్, పాటలతో సినిమాపై హైప్ క్రియేట్ చేసిన నీల్.. ఇప్పుడు ఎట్టకేలకు ఫ్యాన్స్ అంచనాలను బ్రేక్ చేశాడు. ప్రస్తుతం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. సలార్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. అటు నిన్న మొదటి రోజే థియేటర్లలో సలార్ సినిమా చూశారు టాలీవుడ్ యంగ్ హీరోస్. నటుడు శ్రీవిష్ణు, నిఖిల్ సలార్ చిత్రాన్ని ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సలార్ సినిమాపై టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలు తెలియజేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం సలార్ పై రివ్యూ ఇచ్చారు.

Megastar Chiranjeevi: 'సలార్' సినిమాపై మెగాస్టార్ రివ్యూ.. ప్రభాస్, ప్రశాంత్ నీల్ గురించి ఏమన్నారంటే..
Megastar Chiranjeevi, Prabh
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 23, 2023 | 10:09 AM

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా ‘సలార్’. ఎన్నోసార్లు వాయిదాలు పడిన ఈ మూవీ ఎట్టకేలకు అడియన్స్ ముందుకు వచ్చింది. డిసెంబర్ 22న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో రిలీజ్ అయ్యింది. మొదటి రోజే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చేసింది. ట్రైలర్, టీజర్, పాటలతో సినిమాపై హైప్ క్రియేట్ చేసిన నీల్.. ఇప్పుడు ఎట్టకేలకు ఫ్యాన్స్ అంచనాలను బ్రేక్ చేశాడు. ప్రస్తుతం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. సలార్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. అటు నిన్న మొదటి రోజే థియేటర్లలో సలార్ సినిమా చూశారు టాలీవుడ్ యంగ్ హీరోస్. నటుడు శ్రీవిష్ణు, నిఖిల్ సలార్ చిత్రాన్ని ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సలార్ సినిమాపై టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలు తెలియజేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం సలార్ పై రివ్యూ ఇచ్చారు.

“డియర్ దేవా (ప్రభాస్)కి ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సలార్ సీజ్ ఫైర్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాను నిర్మించిన ప్రపంచానికి రాణిస్తున్నారు. పృథ్వీ, శ్రుతిహాసన్, జగపతి బాబు మిగతా టెక్నీకల్ టీం అంతా సినిమాలో అద్భుతం చేశారు ” అంటూ మెగాస్టార్ సలార్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక ప్రభాస్ సినిమాపై చిరు ఇచ్చిన పాజిటివ్ రివ్యూతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చిరు ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఇక చిరు సినిమాల విషయానికి వస్తే.. చివరిసారిగా భోళా శంకర్ సినిమాలో నటించారు. మెహర్ రమేశ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు చిరు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఇందులో చిరు జోడిగా త్రిష నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.