Prabhas Salaar Review: సలార్ హిట్టా.? ఫట్టా.? మునుపెన్నడూ చూడని డార్లింగ్ మాస్ అవతారం.
బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం చూస్తున్న ప్రభాస్ తాజాగా సలార్ సినిమాతో వచ్చారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా పార్ట్ 1.. సీజ్ ఫైర్ విడుదలైంది. మరి ఈ చిత్రం అంచనాలు అందుకుందా..? ఆకాశమంత అంచనాలతో వచ్చిన సలార్‌కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారా..? ప్రభాస్ కెరీర్‌లో మరో హిట్ చేరిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం చూస్తున్న ప్రభాస్ తాజాగా సలార్ సినిమాతో వచ్చారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా పార్ట్ 1.. సీజ్ ఫైర్ విడుదలైంది. మరి ఈ చిత్రం అంచనాలు అందుకుందా..? ఆకాశమంత అంచనాలతో వచ్చిన సలార్‌కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారా..? ప్రభాస్ కెరీర్‌లో మరో హిట్ చేరిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.. ఖాన్‌సార్ అనే ఊళ్లో దేవారథ అలియాస్ ప్రభాస్, వరద రాజ మన్నార్ అలియాస్ పృథ్విరాజ్ సుకుమారన్ చిన్ననాటి స్నేహితులు. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటారు. మరోవైపు ఆ ఖాన్‌సార్‌కు కర్తగా ఉంటారు రాజమన్నార్ అలియాస్ జగపతిబాబు. తాను ఓసారి సామ్రాజ్యం నుంచి బయటికి వెళ్తాడు. తాను తిరిగి వచ్చే సమయానికి తన కొడుకు వరద మన్నార్ దొర కావాలని కోరుకుంటాడు. ఆయన వెళ్లిన తర్వాత కుర్చీ కోసం కొట్లాట మొదలవుతుంది. మిగిలిన దొరలు అందరూ కలిసి వరదను చంపాలనుకుంటారు. దానికోసం ఎవరికి వాళ్లు తమ ఆర్మీని తెచ్చుకుంటారు. అదే సమయంలో దేవాను తన సైన్యంగా ఖాన్‌సార్‌కు తెచ్చుకుంటాడు వరద. ఆ తర్వాత ఏం జరిగింది..? కుర్చీ కోసం జరిగిన పోరులో ఎవరు గెలిచారు..? వీళ్ల మధ్యలోకి ఆద్య అలియాస్ శృతి హాసన్ ఎందుకు వచ్చింది..? అసలు ప్రాణ స్నేహితులుగా ఉన్న దేవా, వరద ఎందుకు బద్ధ శత్రువులుగా మారిపోయారు అనేది మిగిలిన కథ..
కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్.. ఈ డైలాగ్ ఇన్నాళ్లకు పనికొచ్చింది.. ప్రభాస్ కటౌట్‌ను కరెక్టుగా వాడుకుంటే.. కథ, కాకరకాయ్‌తో పనిలేదని నిరూపించాడు ప్రశాంత్ నీల్. బాహుబలి తర్వాత.. ఇంకా చెప్పాలంటే రాజమౌళి కంటే ఎక్కువగానే ప్రభాస్‌ను ఎలివేట్ చేసాడు. సినిమా మొదలైన దగ్గర్నుంచి ఎండ్ కార్డ్ పడేవరకు ఓన్లీ ఎలివేషన్స్‌తో వెళ్లిపోయింది కథ. ప్రతీ సీన్ క్లైమాక్స్ అన్నట్లు.. ప్రతీ సీన్‌లోనూ హీరో కారెక్టర్‌ను లేపాడు ప్రశాంత్ నీల్.. అన్నీ చూస్తుంటే.. వీడెవడ్రా ఎలివేషన్‌కు అమ్మా మొగుడులా ఉన్నాడు అనిపించక మానదు. చిన్న ప్లాస్టిక్ కత్తిని హీరో చేతిలో చూడగానే.. తల్లి ఉలిక్కిపడుతుంది.. భయపడుతుంది. గతంలో ఎంతటి రక్తపాతం సృష్టిస్తే ఆ ప్లాస్టిక్ కత్తికి తల్లి వణికిపోతుంది అనే ఊహే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అలా తన హీరోను ఎలివేట్ చేయడానికి ఏ చిన్న ముక్కా వదల్లేదు ప్రశాంత్ నీల్. ఛత్రపతిలో గీత దాటే సీన్ ఉన్నట్లు.. ఇందులో మూడు నాలుగు రాసుకున్నాడు దర్శకుడు.. వాటి చుట్టూ సీన్స్ అల్లుకున్నాడంతే. హీరో లేకపోయినా.. ప్రతీ సీన్‌లో అతడి ఎఫెక్ట్ కనిపించేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. స్క్రీన్ మీద ప్రభాస్ ఫైట్ చేసిన ప్రతీసారి చూసే ఆడియన్స్ పిచ్చెక్కిపోతారంతే. ఆ కటౌట్‌ను అలా వాడుకున్నాడు ప్రశాంత్ నీల్. జస్ట్ అలా నడిచొస్తుంటే చాలు.. వద్దన్నా చేతులు నోటి దగ్గరికి వెళ్లి విజిల్స్ వేస్తాయంతే.
ఇక సెకండాఫ్‌లో వచ్చే కాటేరమ్మ ఫైట్ అయితే నెక్ట్స్ లెవల్. ఆ రేంజ్ ఎలివేషన్ ఇండియన్ స్క్రీన్‌పై చూసి చాలా కాలమైపోయింది. తన స్నేహితుడి కోసం ఎందుకు హీరో ఎంతదూరమైనా వెళ్తాడు అనేది ముందు నుంచే ఎస్టాబ్లిష్ చేసాడు దర్శకుడు. కానీ అదే సమయంలో హీరో తల్లి మాత్రం అవసరం వచ్చినపుడు కొడుకును రెచ్చిపో అని చెప్తుంది.. మిగిలిన సమయాల్లో ఎవరు చచ్చిపోయినా పట్టించుకోదు. అలా ఎందుకు మారిపోతుందనేది మాత్రం చూపించలేదు. బహుశా సెకండ్ పార్ట్‌లో పూర్తి క్లారిటీ ఇస్తాడేమో దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కారెక్టరైజేషన్ అదిరిపోయింది. బద్ధలవ్వడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా కనిపిస్తుంటాడు దేవా పాత్ర. అదెప్పుడు బద్ధలవుతుందా అని ఆడియన్స్ ఆసక్తిగా చూసేలా డిజైన్ చేసాడు ప్రశాంత్ నీల్. ఒక్కసారి బద్ధలైన తర్వాత వచ్చే లావా ఎలా ఉంటుందో స్క్రీన్ మీద కనిపించింది. మాస్ హిస్టీరియా కోసం వెళ్తే సలార్‌ను సూపర్‌గా ఎంజాయ్ చేయొచ్చు. అలా కాదు.. కథ, కథనాలు కావాలి.. లాజిక్ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ సినిమా అంత ఎక్కకపోవచ్చు. దేవారథ పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు.. బ్లడ్ బాత్ చేసేసాడు. మాటలు తక్కువ.. యాక్షన్ ఎక్కువ అన్నట్లుంది ప్రభాస్ కారెక్టరైజేషన్. ఇంటర్వెల్ బ్లాక్‌లో ప్రభాస్ కటౌట్ అయితే మాటల్లేవు. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర బాగానే సూట్ అయింది. వరద పాత్రకు న్యాయం చేసాడు. శృతి హాసన్ హీరోయిన్‌లా కాకుండా కథను తీసుకెళ్లే పాత్రలా ఉంది. వీరికి తోడు రవి బస్రూర్ మరోసారి తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసాడు. ఇక ఓవరాల్‌గా సలార్.. ప్రభాస్ మాస్ విశ్వరూపం అంతే.!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.