AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya- Jyothika: ప్రఖ్యాత మూకాంబికా అమ్మవారి ఆలయంలో సూర్య, జ్యోతిక ప్రత్యేక పూజలు.. ఎందుకంటే?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా ఎంతో పేరు తెచ్చుకున్న సూర్య, జ్యోతిక ఆధ్యాత్మిక బాట చేపట్టారు. సినిమా షూటింగులతో నిత్యం బిజీగా ఉండే వారు తాజాగా కర్ణాటక రాష్ట్రం లోని కొల్లూరులో కొలువైన మూకాంబికా అమ్మవారిని దర్శించుకున్నారు.

Suriya- Jyothika: ప్రఖ్యాత మూకాంబికా అమ్మవారి ఆలయంలో సూర్య, జ్యోతిక ప్రత్యేక పూజలు.. ఎందుకంటే?
Suriya Family
Basha Shek
|

Updated on: Nov 26, 2024 | 5:41 PM

Share

కర్ణాటక రాష్ట్రంలోని కొల్లూరులో కొలువైన మూకాంబిక అమ్మవారి దర్శనం కోసం రోజూ వేర్వేరు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడికి సామాన్య ప్రజలే కాకుండా ప్రముఖులు కూడా దర్శనం కోసం వస్తుంటారు. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రిషబ్ శెట్టి తదితర ప్రముఖలు ఈ ఆలయాన్ని సందర్శంచుకున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక మూకాంబిక దేవిని దర్శించుకున్నారు. మంగళవారం (నవంబర్26) ఈ ఆలయానికి వచ్చిన వారు చండీకాయాగంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. కొల్లూరు దేవాలయం ఉడిపి జిల్లాలోని బైందూరు తాలూకాలో ఉంది. రోజూ వేలాది మంది భక్తులు అక్కడికి వస్తుంటారు. ఇప్పుడు కోలీవుడ్ జంట కూడా ఇక్కడికి రావడం విశేషం. ఈ క్రమంలోనే సెలబ్రిటీ జంటను చూసేందుకు భక్తులు, సినీ అభిమానులు ఎగబడ్డారు.

కాగా సూర్య, జ్యోతిలకు కర్ణాటకలోనూ భారీ అభిమానులున్నారు. ముఖ్యంగా సూర్య నటించిన సినిమాలన్నీ కన్నడలోనూ విడుదలవుతుంటాయి. ఈ క్రమంలోనే శాండల్ వుడ్ లో సూర్యకు బాగా క్రేజ్ పెరిగింది. ఇదిలాఉంటే ఇటీవల సూర్యకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అతను హీరోగ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘కంగువా’ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. వందలాది కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ కు తమిళ నాట బాగానే వసూళ్లు వచ్చినప్పటికీ ఇతర ప్రాంతాల్లో సూర్య సినిమాను పెద్దగా పట్టించుకోవడం లేదు. శివ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటించగా మరో బాలీవుడ్ నటుడు బాబీ డియోలో కీలక పాత్రలో మెరిశాడు.

ఇవి కూడా చదవండి

మూకాంబికా అమ్మవారి ఆలయంలో సూర్య- జ్యోతిక దంపతులు..

కంగువా సినిమాలో సూర్య..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ