Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandramukhi 2 OTT : ఓటీటీలోకి కంగనా చంద్రముఖి2 సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే

సూపర్ హిట్ సినిమాలు చాలా ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కొన్ని సినిమా అధికారికంగా ప్రకటించి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. మరొకొన్ని సినిమాలు మాత్రం సడన్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను షాక్ కు గురి చేశాయి. ఇక ఇప్పుడు క్రేజీ మూవీ ఒకటి ఓటీటీలోకి రానుంది. ఆ సినిమానే చంద్రముఖి 2. దాదాపు 17 ఏళ్ల క్రితం వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు.

Chandramukhi 2 OTT : ఓటీటీలోకి కంగనా చంద్రముఖి2 సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే
Chandramukhi 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 17, 2023 | 12:21 PM

థియేటర్స్‌లో రిలీజ్ అయిన సినిమాలు హిట్ అయినా..? డిజాస్టర్ అయినా నెలరోజులకు ఓటీటీకి రావడం మాత్రం పక్కా..! ఇక ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. సూపర్ హిట్ సినిమాలు చాలా ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కొన్ని సినిమా అధికారికంగా ప్రకటించి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. మరొకొన్ని సినిమాలు మాత్రం సడన్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను షాక్ కు గురి చేశాయి. ఇక ఇప్పుడు క్రేజీ మూవీ ఒకటి ఓటీటీలోకి రానుంది. ఆ సినిమానే చంద్రముఖి 2. దాదాపు 17 ఏళ్ల క్రితం వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో హీరోగా రాఘవ లారెన్స్ నటించాడు. అలాగే చంద్రముఖిగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటించింది. గతంలో వచ్చిన చంద్రముఖి సినిమాకు దర్శకత్వం వహించిన ఫై వాసూనే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు.

లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చంద్రముఖి 2 సెప్టెంబర్ 28న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. థియేటర్స్ లో చంద్రముఖి సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రానుంది.

చంద్రముఖి ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇక నెట్ ఫ్లిక్స్ లో చంద్రముఖి 2 సినిమాను అక్టోబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక చంద్రముఖి 2 సినిమాలో కంగనా చంద్రముఖి పాత్రలో నటించింది. అలాగే మహిమా నంబియార్‌, లక్ష్మీ మీనన్‌, సుభీక్ష కీలక పాత్రల్లో నటించారు.

లైకా ప్రొడక్షన్ ట్విటర్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..