AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalyan Ram: ‘అమిగోస్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. మాస్ లుక్‎లో కళ్యాణ్ రామ్ పోస్టర్ చూశారా ?..

ఇప్ప‌టికే విడుద‌లైన ‘అమిగోస్’ మూవీ టీజ‌ర్‌, సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చాయి. ఇక మంగళవారం విడుదలైన ఎన్నో రాత్రులొస్తాయి గానీ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు హీరో కళ్యాణ్ రామ్.

Kalyan Ram: 'అమిగోస్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. మాస్ లుక్‎లో కళ్యాణ్ రామ్ పోస్టర్ చూశారా ?..
Amigos Trailer
Rajitha Chanti
|

Updated on: Feb 01, 2023 | 7:55 PM

Share

డిఫ‌రెంట్ చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్. ఇటీవలే ఆయన బింబిసార చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆయన త్రిపాత్రిభిన‌యంలో న‌టించిన లేటేస్ట్ సినిమా ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే అమిగోస్ సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ‘అమిగోస్’ మూవీ టీజ‌ర్‌, సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చాయి. ఇక మంగళవారం విడుదలైన ఎన్నో రాత్రులొస్తాయి గానీ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు హీరో కళ్యాణ్ రామ్.

ఈ సినిమా ట్రైలర్ ను ఫిబ్రవరి 3న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు హీరో కళ్యాణ్ రామ్. ఈ విషయాన్ని తెలియజేస్తూ మాస్ లుక్ పోస్టర్ ట్వీట్ చేశారు. ఈ సినిమా ద్వారా మీరు సరికొత్త థ్రిల్ పొందుతారంటూ పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది ఈ కన్నడ సోయగం.

ఇవి కూడా చదవండి

ఇక మంగళవారం విడుదలైన సెకండ్ సాంగ్‌ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన ధ‌ర్మ క్షేత్రం సినిమాలో ఎవ‌ర్ గ్రీన్ మెలోడి సాంగ్ ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’ సాంగ్‌కి ఇది రీమిక్స్ సాంగ్‌. ధ‌ర్మ క్షేత్రంలోని ఎన్నో రాత్రులొస్తాయిగానీ.. పాట‌ను ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం పాడారు. యాదృచ్చికంగా ఇప్పుడు అదే పాట‌కు రీమిక్స్ సాంగ్‌ను కూడా ఆయ‌న త‌న‌యుడు ఎస్‌.పి.బి.చ‌ర‌ణ్ ఆల‌పించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.