Pawan Kalyan: తమ్ముడి సినిమాలో స్టంట్స్ అన్ని డూప్ అంటగా ?.. బాలయ్య ప్రశ్నకు పవన్ ఏం చెప్పారో తెలుసా..

ఇప్పటికే విడుదలైన ప్రోమోస్ ఎపిసోడ్ పై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. ఎప్పుడెప్పుడు షో స్ట్రీమింగ్ అవుతుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. పవన్‌ హాజరుకానున్న ఈ షోను మేకర్స్‌ రెండు పార్ట్స్‌గా స్ట్రీమింగ్ చేయనున్నారు.

Pawan Kalyan: తమ్ముడి సినిమాలో స్టంట్స్ అన్ని డూప్ అంటగా ?.. బాలయ్య ప్రశ్నకు పవన్ ఏం చెప్పారో తెలుసా..
Pawan Kalyan
Follow us

|

Updated on: Feb 01, 2023 | 9:15 PM

నందమురి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 గురించి తెలిసిందే. ఫస్ట్ సీజన్ కంటే సెకండ్ సీజన్‏కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈసారి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రావడంతో ఒక్కసారిగా ఆహా సైట్ క్రాష్ అయ్యింది. ఇక ఇప్పుడు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎపిసోడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది. ఈ ఎపిసోడ్ తోనే ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోస్ ఎపిసోడ్ పై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. ఎప్పుడెప్పుడు షో స్ట్రీమింగ్ అవుతుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. పవన్‌ హాజరుకానున్న ఈ షోను మేకర్స్‌ రెండు పార్ట్స్‌గా స్ట్రీమింగ్ చేయనున్నారు. మొదటి ఎపిసోడ్‌ ఫిబ్రవరి 2వ తేదీన స్ట్రీమింగ్‌ కానుండగా, రెండో ఎపిసోడ్‌ ఫిబ్రవరి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. స్ట్రీమింగ్ తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో షోపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన లేటేస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు.

అందులో పవన్ కు ట్రూ ఫాల్స్ అనే బోర్డ్ ఇచ్చి.. ప్రశ్నకు నిజమైతే ట్రూ అని.. అబద్ధం అయితే ఫాల్స్ అని చూపించాలి. తమ్ముడు సినిమా సమయంలో జరిగిన స్టంట్స్ గురించి బాలయ్య ప్రశ్నించారు. తమ్ముడు సినిమాలో జరిగిన స్టంట్స్ అన్నీ డూప్ తో చేసినవి అంటగా ? అని బాలయ్య అడగ్గా.. పవన్ నవ్వుతూ.. అటు ట్రూ అని.. ఇటు ఫాల్స్ అని కాకుండా బోర్డ్ తిప్పుతూ.. నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదంటూ చెప్పుకొచ్చారు.

ఇక అప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ.. ఆ పాటలో ఒక పోల్ ను కొట్టే సీన్ ఉంటుంది. యాక్షన్ అనగానే నేను పోల్ ను కొట్టడం స్టార్ట్ చేశాను. చూస్తే చేతికి రక్తం కారుతూ ఉంది. కట్ చెప్పిన తర్వాత ఆ ఆర్ట్ డైరెక్టర్ ఎవరో రమ్మని చెప్పండి అని చెప్పాను. అంటూ చెప్పుకొచ్చారు పవన్. ఇక ఈ ఎపిసోడ్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.