Jr.NTR: అభిమానులతో ఎన్టీఆర్ ముచ్చట్లు.. ఫ్యాన్స్ మాటలకు తారక్ షాక్.. నెట్టింట వీడియో వైరల్..
ఇప్పుడు వరల్డ్ వైడ్ అడియన్స్ ఎన్టీఆర్ మూవీస్ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. ట్రిపుల్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ నటనకు హాలీవుడ్ మేకర్స్ సైతం ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు తారక్. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా కనిపిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అద్భుతమైన నటన, డాన్స్తోనే కాకుండా అంతకు మించి మంచి మనసున్న నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ స్థానం సంపాదించుకున్నారు తారక్. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న తారక్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ అందుకున్నారు. ఇప్పుడు వరల్డ్ వైడ్ అడియన్స్ ఎన్టీఆర్ మూవీస్ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. ట్రిపుల్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ నటనకు హాలీవుడ్ మేకర్స్ సైతం ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు తారక్. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా కనిపిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఇదిలా ఉంటే..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో వైరలవుతుంది. అందులో అభిమానులతో తారక్ ముచ్చటిస్తూ ఉండగా..ఎన్టీఆర్ భార్య సతీమణి, తల్లి షాలిని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. అసలు మ్యాటరేంటంటే.. నిన్న (నవంబర్ 30)న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం నుంచి సాధారణ ప్రజలతోపాటు సెలబ్రెటీస్ సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రధాన ప్రాంతాల్లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, నితిన్ ఇలా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక భార్య లక్ష్మి ప్రణతి, తల్లి షాలినితో కలిసి పోలింగ్ బూత్ వద్దకు చేరుకుని లైన్ లో నిలబడ్డారు తారక్.
🚨 Junior NTR arrives at the polling station with wife to cast vote.#JrNTR #TelanganaElections2023 pic.twitter.com/sLQfuTpxoz
— Mix Masala (@BollywoodOnly1) November 30, 2023
అయితే ఓటు వేసేందుకు క్యూ లైన్ లో నిలబడిన సమయంలో అక్కడ కొంతమంది యూట్యూబ్ ఛానల్ కు సంబంధించిన వారితో తారక్ ముచ్చటించారు. తారక్, లక్ష్మీ ప్రణతి.. ఎన్టీఆర్ మథర్ షాలిని ఫోటోస్ తీస్తున్నారు అక్కడున్న కెమెరామెన్స్. కాసేపు వారిని గమనించిన తారక్.. “మీరు ఓటు వేయరా. ఇక్కడే ఉంటారా ?.. ” అని ప్రశ్నించాడు తారక్. దీంతో “మీరు ఓటు వేసిన తర్వాత వేస్తాము. అయితే అందరూ వేయము సగం మందే వేస్తాము ” అంటూ ఆన్సర్ ఇచ్చారు సదరు యూట్యూబ్ ఛానల్స్. సగం మంది వెయ్యరా ? ఆశ్చర్యం వ్యక్తం చేశారు తారక్. ఇక వీరు మాట్లాడుకుంటున్న సమయంలో ఆయన భార్య, తల్లి చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
#JrNTR :- Miru Andharu Ikkade Untaraa Vote Lu Veyyara Poyyi Miru 🤣😂😂. #ManOfMassesNTR@tarak9999 👌❤️. #TelanganaElections2023 pic.twitter.com/XnPnf00Fkp
— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) November 30, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.