NTR : నా సినిమాను మీ భుజాల పై మోసారు.. ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన తారక్

దేవర సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించింది. అలాగే ఈ సినిమాలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటించాడు. ఇప్పటికే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది. ఇప్పటికే రూ. 500కోట్లకు పైగా వసూల్ చేసింది

NTR : నా సినిమాను మీ భుజాల పై మోసారు.. ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన తారక్
Ntr
Follow us

|

Updated on: Oct 15, 2024 | 4:51 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అంచనాలను మించి విజయాలను అందుకుంది. దేవర సినిమాను రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 ను విడుదల చేశారు. ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించింది. అలాగే ఈ సినిమాలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటించాడు. ఇప్పటికే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది. ఇప్పటికే రూ. 500కోట్లకు పైగా వసూల్ చేసింది ఈ మూవీ. ఇక దేవర సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన అభిమానులకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇది కూడా చదవండి : ఓ మై వసుధారా..! వారెవ్వా అనిపిస్తున్న గుప్పెడంత మనసు భామ

” దేవర పార్డ్ 1కి అందుతున్న అద్భుతమైన స్పందనకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.ఈ సినిమా ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. ” అలాగే ఈ సినిమాలో నటించిన నా సహ నటులైన సైఫ్ అలీ ఖాన్ సర్, జాన్యీ, ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు మరియు ఇతర నటీనటులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు తమ పాత్రలకు ప్రాణం పోసి, మా కథకు జీవం ఇచ్చారు. నా దర్శకుడు కొరటాల శివకి ధన్యవాదాలు. ఈ కథను సృష్టించిన ఆయన దిశానిర్ధేశంతోనే ఈ ప్రాజెక్ట్ విజయవంతమైంది. అనిరుధ్ అద్భుతమైన సంగీతం, రత్నవేలు సర్ సినిమాటోగ్రఫి, సాబూ సార్ ప్రొడక్షన్ డిజైన్, యుగంధర్ గారు వీఎఫ్ ఎక్స్, శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ తో ఈ చిత్రాన్ని అడ్డుతంగా మలిచినందుకు ధన్యవాదాలు.

ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా.? ఎవరో చెప్పుకోండి చూద్దాం.!

మా సినిమాను విజయవంతంగా ప్రదర్శించిన పంపిణీదారులు మరియు థియేటర్ ప్రదర్శకులకు ధన్యవాదాలు. నా సినీ పరిశ్రమ మిత్రులకు వారు అందించిన ప్రేమకు ధన్యవాదాలు. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న మీడియాకు మా సినిమాను విశేషంగా ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు. మా నిర్మాతలు సుధాకర్ మిక్కిలినేని గారు మరియు హరికృష్ణ కొసరాజు గారికి ఈ ప్రాజెక్టు ను విజయవంతంగా రూపొందించినందుకు ధన్యవాదాలు.

ఇది కూడా చదవండి :ఒంటరిగానే చూడాల్సిన సినిమా.. బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. కానీ ఓటీటీలోకి..

ప్రపంచ నలుమూలల ఇంతటి ఆదరణ చూపిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నా ధన్యవాదాలు. నా కుటుంబ సభ్యులైన అభిమానులందరికీ, గత నెల రోజులుగా దేవర చిత్రాన్ని ఒక పండుగలా జరుపుకుంటున్నందుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు చూపించే ప్రేమ అభిమానమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. మీరు ఎల్లప్పుడు గర్వపడే చిత్రాలు చేస్తూనే ఉండడానికి నా ఆయశక్తులా ప్రయత్నిస్తాను. దేవర పార్ట్ 1′ చిత్రాన్ని మీ భుజాలపై మోసి ఇంతటి ఘన విజయవంతంగా మారినందుకు కృతజ్ఞతలు అని ఎన్టీఆర్ తన లేఖలో రాసుకొచ్చారు.

ఇది కూడా చదవండి : ఏడుపు అంటే చాలా ఇష్టం.. అందం కోసం ఏడుస్తానంటున్న స్టార్ హీరోయిన్

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీడియోస్ లీక్ చేస్తా.. అనన్యకు స్టార్ హీరో కొడుకు బెదిరింపులు.!
వీడియోస్ లీక్ చేస్తా.. అనన్యకు స్టార్ హీరో కొడుకు బెదిరింపులు.!
అభిమానులకు షాకిచ్చిన స్టార్ హీరో.. బిగ్‏బాస్ ‏కు ఇక గుడ్ బై.!
అభిమానులకు షాకిచ్చిన స్టార్ హీరో.. బిగ్‏బాస్ ‏కు ఇక గుడ్ బై.!
ఆసుపత్రిలో పడి ఉంటే.. ఎవరూ పట్టించుకోలేదు.! చలాకి చంటి ఎమోషనల్
ఆసుపత్రిలో పడి ఉంటే.. ఎవరూ పట్టించుకోలేదు.! చలాకి చంటి ఎమోషనల్
అబ్బో.. ఏకంగా రూ.12 లక్షలు సంపాదించేసిందిగా.!
అబ్బో.. ఏకంగా రూ.12 లక్షలు సంపాదించేసిందిగా.!
చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు? కట్ చేస్తే.. ఇలా మారిపోయిన స్టార్
చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు? కట్ చేస్తే.. ఇలా మారిపోయిన స్టార్
ఆ ఊరిపై పాములు పగబట్టాయా.? ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పాములే.
ఆ ఊరిపై పాములు పగబట్టాయా.? ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పాములే.
వీడిని కొడుకు అంటారా.? తండ్రిని భిక్షమెత్తుకునేలా చేసిన వ్యక్తి..
వీడిని కొడుకు అంటారా.? తండ్రిని భిక్షమెత్తుకునేలా చేసిన వ్యక్తి..
గుడిలో శ్లోకాలు చదువుతున్న మహిళలు.. చేతివాటం చూపించిన దొంగ
గుడిలో శ్లోకాలు చదువుతున్న మహిళలు.. చేతివాటం చూపించిన దొంగ
దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీకి మరో గండం
దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీకి మరో గండం
తీవ్ర విషాదం.. దాహం తీర్చాల్సిన నీరే.. ప్రాణం తీసింది.. ఎక్కడంటే
తీవ్ర విషాదం.. దాహం తీర్చాల్సిన నీరే.. ప్రాణం తీసింది.. ఎక్కడంటే