RRR Movie : “ఆర్ఆర్ఆర్” అప్డేట్.. గ్లింప్స్ రిలీజ్‌ను వాయిదా వేసిన మేకర్స్.. కారణం ఇదేనా..
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమానుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్‌గా మారిపోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండగా.. గిరిజన వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారని అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. ఈ రోజు (శుక్రవారం ) ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ విడుదల చేయాల్సి ఉంది. అయితే దానిని వాయిదా వేశారు మేకర్స్. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం కారణంగా ఈ రోజు విడుదల చేయాల్సిన గ్లింప్స్‌ను వాయిదా వేశారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆర్ఆర్ఆర్ మేకర్స్. త్వరలోనే గ్లింప్స్ రిలీజ్‌కు సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నారు. ఇక కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో కన్నడ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా గుండెపోటు రావడంతో పునీత్ కుప్పకూలిపోయారు. అనంతరం ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తుండగా పునీత్ కన్నుమూశారు. పునీత్ మరణం పై సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Due to unforeseen circumstances, the announcement about #RRRMovie glimpse which was to be made in the evening today stands postponed.
— RRR Movie (@RRRMovie) October 29, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :