Jr.NTR: తారక్‌ చిత్రపటానికి హారతి ఇప్పించి, సారీ చెప్పించి.. సునిశిత్‌కు వెరైటీ పనిష్మెంట్ ఇచ్చిన ఫ్యాన్స్

సునిశిత్‌.. నిత్యం స్టార్‌ హీరోలు, హీరోయిన్లపై అనుచిత కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలిచే ఇతని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. తాను త్యాగాలు చేయడం వల్లే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలయ్యారంటూ శాక్రిఫైసింగ్‌ స్టార్‌ గా తనకు తను డప్పు కొట్టుకుంటాడు.

Jr.NTR: తారక్‌ చిత్రపటానికి హారతి ఇప్పించి, సారీ చెప్పించి.. సునిశిత్‌కు వెరైటీ పనిష్మెంట్ ఇచ్చిన ఫ్యాన్స్
Sunisith
Follow us

|

Updated on: May 29, 2023 | 4:00 PM

సునిశిత్‌.. నిత్యం స్టార్‌ హీరోలు, హీరోయిన్లపై అనుచిత కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలిచే ఇతని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. తాను త్యాగాలు చేయడం వల్లే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలయ్యారంటూ శాక్రిఫైసింగ్‌ స్టార్‌ గా తనకు తను డప్పు కొట్టుకుంటాడు. ఇతను చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని చూసే ప్రేక్షకులకు కూడా తెలుసు. అయితే కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్ సునిశిత్‌తో ఇంటర్వ్యూలు తీసుకుంటూ నానా యాగీ చేస్తున్నాయి. ఈనేపథ్యంలో ఉపాసనపై అనుచిత వ్యాఖ్యలు చేసి మెగా ఫ్యాన్స్‌ చేతుల్లో చావు దెబ్బలు తిన్నాడు. అయినా అతని తీరు మారలేదు. ఈసారి జూనియర్‌ ఎన్టీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా ఉంది. ఇందులో సునిశిత్‌ మాటలు విన్న తారక్‌ ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో అతనిని వెతికి మరీ పట్టుకున్నారు. అయితే రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌లా కొట్టలేదు కానీ కాస్త డిఫరెంట్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ చిత్ర పటాన్ని తీసుకొచ్చి.. దానికి సునిశిత్‌తో హారతి ఇప్పించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాగా సునిశిత్‌ తమకు దొరికితే తగిన శాస్తి చేస్తాం.. చావే గతి అంటూ కొందరు బెదిరించారు. దీంతో భయపడిన సునిశిత్ క్షమాపణలు చెప్పాడు. ‘ ఒక ఛానెల్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ మీద నేను చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నాను. అలాగే తారక్‌ అభిమానులకు కూడా సారీ తెలియజేస్తున్నాను. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయను. నేను కూడా తారక్ అభిమానినే.. కానీ పబ్లిసిటికి వస్తుందని ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నా. ఇకపై నా నుంచి ఇలాంటివి ఉండవు. నేను చేసిన తప్పుకు నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టొద్దు’ అని ఈ వీడియోలో వేడుకున్నాడు సునిశిత్. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరి ఇకనైనా సునిశిత్ మారతాడా? లేక మరో హీరో ఫ్యాన్స్‌కు టార్గెట్ అవుతాడా? అన్నది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..