Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు భారీగా తరలివస్తున్న ఎన్టీఆర్ అభిమానులు..
ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ కలసి ఉన్న ఫ్లెక్సీలను పట్టుకుని బహిరంగ సభ వద్ద అభిమానం చాటుకుంటున్నారు. ఎన్టీఆర్ అభిమానిమే అయిన సమాజంలో మార్పు కోసం పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతున్నామంటున్నారు తారక్ ఫ్యాన్స్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా పవన్ ఏపీలో వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భీమవరంలో శుక్రవారం (జూన్ 30న) సాయంత్రం బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ కలసి ఉన్న ఫ్లెక్సీలను పట్టుకుని బహిరంగ సభ వద్ద అభిమానం చాటుకుంటున్నారు. ఎన్టీఆర్ అభిమానిమే అయిన సమాజంలో మార్పు కోసం పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతున్నామంటున్నారు తారక్ ఫ్యాన్స్. సమాజంలో మార్పు కోరుకుంటున్నా వ్యక్తి పవన్ కళ్యాణ్ అని.. అటువంటి నాయకుడికి అందరూ మద్దతు తెలపాలని.. సినీ హీరో అభిమానం వేరు రాజకీయాలు వేరని అంటున్నారు తారక్ ఫ్యాన్స్. జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా తమ మద్దతు మాత్రం పవన్ కళ్యాణ్ కే తెలుపుతామంటున్నారు. ప్రస్తుతం తారక్, పవన్ కలిసి ఉన్న ప్లెక్సీలకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
