AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanghavi: కుటుంబంతో కలిసి శ్రీవారి సేవలో హీరోయిన్ సంఘవి.. ఎంతగా మారిపోయిందో చూశారా ?..

దర్శనాంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు సంఘవి కుటుంబానికి వేద ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో వారిని సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం ఆలయం వెలుపల పాపతో కలిసి ఫోటోలు దిగారు సంఘవి. ప్రస్తుతం ఆమె ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Sanghavi: కుటుంబంతో కలిసి శ్రీవారి సేవలో హీరోయిన్ సంఘవి.. ఎంతగా మారిపోయిందో చూశారా ?..
Sanghavi
Rajitha Chanti
|

Updated on: Jun 30, 2023 | 5:28 PM

Share

సీనియర్ హీరోయిన్ సంఘవి తన కుటుంబంతో కలిసి ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో సంఘవి తన భర్త వెంకటేష్, కూతురుతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు సంఘవి కుటుంబానికి వేద ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో వారిని సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం ఆలయం వెలుపల పాపతో కలిసి ఫోటోలు దిగారు సంఘవి. ప్రస్తుతం ఆమె ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తెలుగు చిత్రపరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన సంఘవి.. వెండితెరపై కనిపించక దాదాపు 18 సంవత్సరాలు అవుతోంది. అలాగే అటు సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా కనిపించరు. ఆమె ఫ్యామిలీ ఫోటోస్ మాత్రం ఎప్పుడో ఒకసారి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 1993లో అమరావతి సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు సంఘవి. ఆ తర్వాత తెలుగుతోపాటు.. కన్నడ, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించారు. 1995లో శ్రీకాంత్ నటించిన తాజ్ మహల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు సంఘవి. ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఆమె ఆ తర్వాత 1997లో డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన సింధూరం చిత్రంతో ప్రధాన కథానాయికగా కనిపించింది. ఈ సినిమా సంఘవి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఇవి కూడా చదవండి
Sanghavi Family

Sanghavi Family

ఆ తర్వాత తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది సంఘవి. రాజశేఖర్, నాగార్జున, బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, జగపతి బాబు వంటి స్టార్ హీరోలతో జత కట్టింది. ఆమె చివరగా 2005లో ఒక్కడే కానీ ఇద్దరు చిత్రంలో నటించారు. 2016లో ఫిబ్రవరి 3న ఐటీ ప్రొఫెషనల్ ఎన్.వెంకటేష్‏ను వివాహం చేసుకున్నారు సంఘవి. వీరికి పాప జన్మించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చికెన్, మటన్ వారం రోజుల పాటు ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలిస్తే
చికెన్, మటన్ వారం రోజుల పాటు ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలిస్తే
బంగారం ధరలు మరోసారి పతనం.. ఒక్కసారిగా సీన్ రివర్స్
బంగారం ధరలు మరోసారి పతనం.. ఒక్కసారిగా సీన్ రివర్స్
డైలీ లవంగాలను తింటే.. మీ శరీరంలో జరిగేది ఇదే..
డైలీ లవంగాలను తింటే.. మీ శరీరంలో జరిగేది ఇదే..
బిస్కెట్లపై రంధ్రాల వెనక షాకింగ్ నిజం.. ఆ రహస్యం బయటపడింది!
బిస్కెట్లపై రంధ్రాల వెనక షాకింగ్ నిజం.. ఆ రహస్యం బయటపడింది!
నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. చిరు సినిమాపై ఖుష్బు రివ్యూ
నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. చిరు సినిమాపై ఖుష్బు రివ్యూ
టీ20 ప్రపంచకప్‌లో భయం లేని బ్యాటర్లు వీరే.. బరిలోకి దిగితే
టీ20 ప్రపంచకప్‌లో భయం లేని బ్యాటర్లు వీరే.. బరిలోకి దిగితే
చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి..! ఆ ప్రాంతాల్లో గజ గజ..
చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి..! ఆ ప్రాంతాల్లో గజ గజ..
నేటి నుంచి దేశవ్యాప్తంగా భారత్ ట్యాక్సీ సేవలు.. అతి తక్కువ ధరకే..
నేటి నుంచి దేశవ్యాప్తంగా భారత్ ట్యాక్సీ సేవలు.. అతి తక్కువ ధరకే..
మహాశివరాత్రి రోజున రాజయోగం.. ఈ 3 రాశులకు అదృష్టం పట్టబోతుంది..!
మహాశివరాత్రి రోజున రాజయోగం.. ఈ 3 రాశులకు అదృష్టం పట్టబోతుంది..!
నిజాయితీకి దక్కిన గౌరవం.. పారిశుధ్య కార్మికురాలికి గోల్డ్‌‌చైన్
నిజాయితీకి దక్కిన గౌరవం.. పారిశుధ్య కార్మికురాలికి గోల్డ్‌‌చైన్