AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Thalapathy: చిక్కుల్లో హీరో విజయ్ దళపతి.. లియో టీమ్‏పై పోలీస్ కేసు నమోదు.. ఎందుకంటే..

ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ మూవీపై మరింత అంచనాలను పెంచేశాయి. అలాగే ఇటీవల విడుదలైన నా రెడీ సాంగ్ సైతం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. అయితే ఇప్పుడిదే పాట విజయ్ దళపతిని చిక్కుల్లోకి నెట్టింది. కేవలం విజయ్ మాత్రమే కాదు..మొత్తం చిత్రయూనిట్ పై కేసు నమోదు అయ్యింది. అందుకు కారణం అందులో విజయ్ సిగరెట్ తాగుతున్నట్లు కనిపించడమే.

Vijay Thalapathy: చిక్కుల్లో హీరో విజయ్ దళపతి.. లియో టీమ్‏పై పోలీస్ కేసు నమోదు.. ఎందుకంటే..
Vijay Thalapathy
Rajitha Chanti
|

Updated on: Jun 26, 2023 | 2:47 PM

Share

కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి సినిమాల గురించి అటు తమిళ్.. ఇటు తెలుగు అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది ప్రారంభంలో వారసుడు సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో.. ఇప్పుడు లియో చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ లొకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‏గా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటిస్తోంది. ఇక ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ మూవీపై మరింత అంచనాలను పెంచేశాయి. అలాగే ఇటీవల విడుదలైన నా రెడీ సాంగ్ సైతం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. అయితే ఇప్పుడిదే పాట విజయ్ దళపతిని చిక్కుల్లోకి నెట్టింది. కేవలం విజయ్ మాత్రమే కాదు..మొత్తం చిత్రయూనిట్ పై కేసు నమోదు అయ్యింది. అందుకు కారణం అందులో విజయ్ సిగరెట్ తాగుతున్నట్లు కనిపించడమే.

ఈ పాటలో మత్తు పదార్థాల వాడకం, రౌడీయిజాన్ని ఎక్కువగా చూపించాంటూ చెన్నైకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఆర్టీఐ.సెల్వం కోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు దళపతితోపాటు.. చిత్రబృందంపై ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశాడు. వీరిపై నార్కోటిక్ కంట్రోల్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇటీవలే విజయ్ తమిళనాడులోని 10,12 తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కలిశారు. దాదాపు 12 గంటలు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులతో ముచ్చటించడమే కాకుండా.. వారికి ప్రోత్సాహకాలు అందించారు. మంచిగా ఉండడమే కాకుండా..డబ్బులు తీసుకోకుండా ఓటు వేసేలా తల్లిదండ్రులు పోత్సాహించాలని చెప్పాడు. అలాంటి విజయ్ ఇప్పుడు సినిమాల్లో సిగరెట్ తాగుతూ నటించడం ఏం బాగోలేదని సదరు వ్యక్తి ఆరోపించాడు.

ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న లియో చిత్రం అక్టోబర్ 19న విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్. తమిళంతోపాటు. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే దాదాపు 17 ఏళ్ల తర్వాత త్రిష, విజయ్ జోడి రిపీట్ అవుతుండడంతో ఈ సినిమా కోసం మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ రైళ్లలో గుర్తింపు కార్డు లేకుండా ప్రయాణించలేరు.. కొత్త రూల్స్‌!
ఆ రైళ్లలో గుర్తింపు కార్డు లేకుండా ప్రయాణించలేరు.. కొత్త రూల్స్‌!
టీటీడీకి హైదరాబాద్ ఐటీ కంపెనీ యజమాని భారీ విరాళం
టీటీడీకి హైదరాబాద్ ఐటీ కంపెనీ యజమాని భారీ విరాళం
కాలేయాన్ని కడిగిన ముత్యంలా మెరిపించే పండు ఇది.. తప్పక తినాలి
కాలేయాన్ని కడిగిన ముత్యంలా మెరిపించే పండు ఇది.. తప్పక తినాలి
బాబు ఫిజిక్స్ టీచర్.. పాప టెన్త్ స్టూడెంట్..పేరెంట్స్‌కు తెలియకుం
బాబు ఫిజిక్స్ టీచర్.. పాప టెన్త్ స్టూడెంట్..పేరెంట్స్‌కు తెలియకుం
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య..!
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య..!
సీజన్‌ మారినప్పుడల్లా తుమ్ములు, జలుబు దాడి చేస్తున్నాయా?
సీజన్‌ మారినప్పుడల్లా తుమ్ములు, జలుబు దాడి చేస్తున్నాయా?
పుల్లటి పెరుగుకు బై-బై! ఈ పెరుగు వారం రోజులైనా పులవదు
పుల్లటి పెరుగుకు బై-బై! ఈ పెరుగు వారం రోజులైనా పులవదు
బాలయ్యే కావాలి.. లైన్‌లో ఏకంగా ఎనిమిది మంది డైరెక్టర్స్
బాలయ్యే కావాలి.. లైన్‌లో ఏకంగా ఎనిమిది మంది డైరెక్టర్స్
బూట్లలో దుర్వాసనతో విసిగి పోయారా? సింపుల్‌గా ఇలా వదిలించుకోండి..
బూట్లలో దుర్వాసనతో విసిగి పోయారా? సింపుల్‌గా ఇలా వదిలించుకోండి..
శుక్ర సంచారం.. ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు
శుక్ర సంచారం.. ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు