AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Dharam Tej: అచ్చం చిరంజీవిలా కనిపిస్తోన్న సాయి ధరమ్ తేజ్.. ఫోటోస్ వైరల్..

అటు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ఫుల్ బిజీ అయ్యాడు. ఇక ఆ తర్వాత యాక్సిడెంట్ కారణంగా కొనాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు తేజ్. ఇటీవలే విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ కార్తిక్ దండు తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తేజ్ కెరీర్‏లోనే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు తేజ్.

Sai Dharam Tej: అచ్చం చిరంజీవిలా కనిపిస్తోన్న సాయి ధరమ్ తేజ్.. ఫోటోస్ వైరల్..
Chiranjeevi, Sai Dharam Tej
Rajitha Chanti
|

Updated on: Jun 26, 2023 | 4:07 PM

Share

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు సాయి ధరమ్ తేజ్. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో హీరోగా తన కెరీర్ ఆరంభించిన సాయి తేజ్.. ఈ సినిమాతో తొలి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్.. సినిమాతో హీరోగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోయాడు. అటు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ఫుల్ బిజీ అయ్యాడు. ఇక ఆ తర్వాత యాక్సిడెంట్ కారణంగా కొనాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు తేజ్. ఇటీవలే విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ కార్తిక్ దండు తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తేజ్ కెరీర్‏లోనే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు తేజ్.

ఇక ఈ సినిమా హిట్ తో ఇప్పుడు తేజ్ ఫుల్ జోష్ మీదున్నాడు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో తేజ్ అచి తూచి అడుగులు వేస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ అయ్యాడు తేజ్. ఇన్ స్టాలో అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా షేర్ చేసిన ఫోటో వైరలవుతుంది. అందులో తేజ్ తన లుక్ పూర్తిగా మార్చేశాడు.

ఇవి కూడా చదవండి

బ్లాక్ కలర్ టీ షర్ట్ ధరించి కళ్లకు బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని స్టైలిష్ లుక్ లో కనిపించారు. అందులో సాయిని చూస్తుంటే చిరంజీవి గుర్తుకు వచ్చారని.. తేజ్ అచ్చం చిరులాగే ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. వింటేజ్ చిరుని గుర్తుచేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి తేజ్ న్యూలుక్ ఫోటో నెట్టింట వైరలవుతుంది. ఇదిలా ఉంటే.. తేజ్ ప్రస్తుతం బ్రో చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం నటిస్తున్నారు. ఈ చిత్రానికి నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

View this post on Instagram

A post shared by Sai Dharam Tej (@jetpanja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.