Vimanam: ఓటీటీలోకి వచ్చేసిన ‘విమానం’.. ఎక్కడ చూడొచ్చంటే..

శివ ప్రసాద్ యానాల దర్శక్వం వహించిన ఈ సినిమా జూన్ 9న థియేటర్లలో రిలీజ్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ప్రేక్షకులకు మెప్పించినప్పటికీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.

Vimanam: ఓటీటీలోకి వచ్చేసిన 'విమానం'.. ఎక్కడ చూడొచ్చంటే..
Vimanam
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 30, 2023 | 4:02 PM

విలక్షణ నటుడు సముధ్రఖని, అనసూయ ప్రధాన పాత్రలలో నటించిన లేటేస్ట్ చిత్రం విమానం. ఇందులో మాస్టర్ ధృవన్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధన్ రాజ్ కీలకపాత్రలలో నటించారు. శివ ప్రసాద్ యానాల దర్శక్వం వహించిన ఈ సినిమా జూన్ 9న థియేటర్లలో రిలీజ్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ప్రేక్షకులకు మెప్పించినప్పటికీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్ ఇప్పుడు ఈ సినిమాను జీ5లో చూడొచ్చు.

వికలాంగుడు అయిన వీరయ్య అనే వ్యక్తి పాత్రలో సముద్రఖని నటించారు. తన కొడుకుతో కలిసి ఓ స్లమ్ ఏరియాలో నివసిస్తుంటాడు. అతడి కొడుకుకు విమానం అంటే చాలా ఇష్టం. విమానం ఎక్కాలనే తన కొడుకు కలను వీరయ్య ఎలా నెరవేర్చాడనేది కథ. అలాగే అదే బస్తీలో సుమతి వేశ్య పాత్రలో అనసూయ నటించింది. అలాగే చెప్పులు కుట్టుకునే కోటి పాత్రలు రాహుల్, డేనియల్ పాత్రోల ధనరాజ్ నటించారు. వీరందరి జీవితాల చుట్టూ ఈ సినిమా నడుస్తుంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.