Mem Famous OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘మేమ్ ఫేమస్’.. ఎప్పుడు.? ఎక్కడ చూడచ్చునంటే.?
స్వీయ దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'మేమ్ ఫేమస్'. ఊరులో పనిపాటా లేకుండా బలాదూర్‌గా తిరిగే ముగ్గురు కుర్రాళ్లు..

స్వీయ దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. ఊరులో పనిపాటా లేకుండా బలాదూర్‌గా తిరిగే ముగ్గురు కుర్రాళ్లు చివరికి ఎలా ఫేమస్ అయ్యారనేది ఈ చిత్ర కథాంశం. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, అంజి మామ, కిరణ్ మచ్చా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ మే 26న ప్రేక్షకుల ముందుకు విడుదలై.. అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘మేమ్ ఫేమస్’ చిత్రం జూన్ 30 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన(మే 26) నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేయడంతో.. అక్కడ మిస్ అయిన ప్రేక్షకులు, ఎంచక్కా ఇంటిల్లిపాదీతో ఓటీటీలో చూసేయండి. కాగా, చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, రైటర్ పద్మభూషణ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న లహరీ ఫిల్మ్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమంత్ ప్రభాస్ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు స్వీయ దర్శకత్వం వహించారు. అలాగే ఈ మూవీతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు.
View this post on Instagram