Tollywood: వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించిన ఎన్టీఆర్.. విశ్వక్ సేన్ కూడా
వర్షాలు, వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు హీరో జూనియర్ ఎన్టీఆర్ తనవంతుగా విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయల విరాళాన్ని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతున్న విషయం తెలిసిందే. జనజీవనం అస్తవ్యస్తమైంది. కాలువలు, చెరువులకు గండిపడ్డాయి. వరదబారిన ప్రజలు ఆకలిదప్పులతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వరద బాధితులకు సాయం అందించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కదిలివస్తున్నారు. వర్షాలు, వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు హీరో జూనియర్ ఎన్టీఆర్ తనవంతుగా విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయల విరాళాన్ని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకు సహాయపడాలని తన వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరొక రూ.50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నట్లు తారక్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఎన్టీఆర్ పేర్కొన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి…
— Jr NTR (@tarak9999) September 3, 2024
వరద బాధితుల సహాయార్థం విరాళం ప్రకటించిన తొలి హీరో ఎన్టీఆర్. దీంతో ఆయన్ను అభిమానులు, నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. తారక్ బాటలో మరికొందరు యువ హీరోలు పయనిస్తున్నారు. ఎన్టీఆర్‌ను బాగా లైక్ చేసే విశ్వక్‌సేన్ సైతం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి 5 లక్షలు విరాళం ప్రకటించారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.