నిజంగా దళపతి గ్రేట్.. చిన్న థియేటర్‌లో ఫ్యాన్స్‌తో కలిసి ప్రభాస్ సినిమా చూసిన విజయ్..
టాలీవుడ్ నటుడు వైభవ్ కూడా ఈ చిత్రంలో నటించారు. ఒక ఇంటర్వ్యూలో, అతను గోట్ షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలను పంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ‘‘ఒకరోజు విజయ్ వైభవ్ ను సినిమాకు వెళ్దామా.?అని అడిగారట. దాని గురించి వైభవ్ చెప్తూ..
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోట్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల చేయనున్నారు. టాలీవుడ్ నటుడు వైభవ్ కూడా ఈ చిత్రంలో నటించారు. ఒక ఇంటర్వ్యూలో, అతను గోట్ షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలను పంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ‘‘ఒకరోజు విజయ్ వైభవ్ ను సినిమాకు వెళ్దామా.?అని అడిగారట. దాని గురించి వైభవ్ చెప్తూ.. “అన్నయ్య నువ్వు థియేటర్ కి ఎలా వస్తావు?” అన్నాను. ఎందుకు నేను థియేటర్‌కి ఎందుకు రాకూడదు? అని విజయ్ తిరిగి అడిగాడు. సరే నేను కూడా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాను. విజయ్, వెంకట్ ప్రభు, నేను, విజయ్ మేనేజర్‌లు కలిసి పీవీఆర్ సినిమాస్‌లో షారూఖ్‌ఖాన్ నటించిన డుంకీ సినిమా చూశాం.
విజయ్ సినిమా అంటే ఎంత అభిమానమో అందరికి తెలిసిందే. ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ కూడా విడుదలైంది. మామూలుగా అయితే ఫేమస్ అయినవాళ్లు కాస్త పెద్ద థియేటర్‌లో మూవీ చూసేందుకు వెళ్తారు. కానీ మేం హైదరాబాద్‌లో ఓ చిన్న థియేటర్ కు వెళ్ళాం. అక్కడ టిక్కెట్టు రూ.80 మాత్రమే. ఆ తరహా థియేటర్లలో అభిమానుల సంబరాలు వేరు లెవల్ లో ఉన్నాయి. డెక్ మీద నిలబడి నృత్యం చేస్తున్నారు ఫ్యాన్స్. ఆ థియేటర్‌లో బాల్కనీ కింది వరుసలో టిక్కెట్లు నాకు పంపించారు. అది చూసి “తప్పు టిక్కెట్టు దొరికింది. బాల్కనీలో పెట్టకుండా కింద వరుసలో ఉంది” అన్నాను. అప్పుడు అతని మేనేజర్లు విజయ్ సినిమాని అలా చూస్తారు అని చెప్పాడు. దానికి నేను గుంపులో నన్ను చితకబాదేస్తారు అని చెప్పి నేను వెళ్ళాను అని చెప్పాను. కానీ అలా ఫ్యాన్స్ తో కూర్చుని సినిమా చూడటం మాస్ అని విజయ్ వెళ్లి హ్యాపీగా సినిమా చూశాడు. సలార్ సినిమా కూడా చాలా బాగుంది అని చెప్పాడు. అలాగే ఆయన మాట్లాడుతూ..
గోట్ షూటింగ్ సమయంలో విజయ్ డ్యాన్స్ చూసి భయపడ్డాను. ఫుల్ గ్రెస్ తో డాన్స్ చేస్తున్నారు విజయ్. మరి ఎందుకు అంత పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేస్తున్నారు.? అని అడిగాను. అభిమానులు పండగ చేసుకోకూడదా? థియేటర్‌కి వచ్చిన వాళ్లకు స్టెప్పులేయాలి అని విజయ్ నాతో చెప్పడం విని చాలా ఆశ్చర్యపోయాను“ అన్నారు వైభవ్.
Here’s the video of thalapathy Vijay watching #salaar movie in Hyderabad as Vaibhav mentioned in his interview 🔥🔥🔥#TheGoat #TheGreatestAllTime pic.twitter.com/kw7Ak1BvwI
— Nicholos (@theraj58) September 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.