Narne Nithiin: గ్రాండ్గా హీరో నార్నే నితిన్ నిశ్చితార్థం.. సందడి చేసిన ఎన్టీఆర్..
టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మ్యాడ్, ఆయ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరో నిశ్చితార్థం ఆదివారం గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, వెంకటేశ్ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ వైరల్ గా మారాయి.

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది.. లక్ష్మీ ప్రణతి సోదరుడు టాలీవుడ్ హీరో నార్నే నితిన్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఆదివారం ఆయన నిశ్చితార్థం వేడుక అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాలు, సన్నిహితులు, బంధువులు పాల్గొన్నారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్, భార్గవ్లతోపాటు హీరో కళ్యాణ్ రామ్, వెంకటేశ్ తదితరులు సందడి చేశారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు తనయుడు నార్నే నితిన్ చంద్ర. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు. ఎన్టీఆర్ బావమరిదిగా సినీరంగంలోకి హీరోగా అడుగుపెట్టిన నితిన్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023లో వచ్చిన మ్యాడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆయన తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆయ్ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేశారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో నార్నే నితిన్ క్రేజ్ మరింత పెరిగింది.
ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు తారక్. ట్రిపుల్ ఆర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని దేవర మూవీతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా… సైఫ్ విలన్ పాత్రలో మెప్పించాడు. ప్రస్తుతం హిందీలో వార్ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు తారక్.
@tarak9999 Anna Family at #NarneNithin wedding reception. pic.twitter.com/Ruti2ahwX8
— hukum🐯 NTR sai (@SaiNTR89219232) November 3, 2024
ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?
Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్ను చూస్తే షాకవ్వాల్సిందే..
Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.