Jani Master: ‘2034లో పవన్ కల్యాణ్ ప్రధాని అవుతారు.. ఇది రాసి పెట్టుకోండి’: జానీ మాస్టర్
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 02) వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల పెద్ద ఎత్తున అన్నదానం, రక్త దాన శిబిరాలు నిర్వహించారు. ఈ క్రమంలో నెల్లూరులో జరిగిన పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో ప్రముఖ కొరియో గ్రాఫర్, జనసేన నేత జానీ మాస్టర్ పాల్గొన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 02) వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల పెద్ద ఎత్తున అన్నదానం, రక్త దాన శిబిరాలు నిర్వహించారు. ఈ క్రమంలో నెల్లూరులో జరిగిన పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో ప్రముఖ కొరియో గ్రాఫర్, జనసేన నేత జానీ మాస్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులను ఉత్సాహ పరుస్తూ పవన్ కల్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. 2029 లో పవన్ ముఖ్యమంత్రి అవుతారని, 2034లో ప్రధాని మంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ‘పవర్ స్టార్ పవర్ కల్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం. 2029లో ఆయన కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. అలాగే 2034లో ప్రధానమంత్రి కూడా అవుతారు. ఇది రాసి పెట్టుకోండి. జై జనసేన’ అని చెప్పుకొచ్చారు. జానీ మాస్టర్ మాటలకు అక్కడున్న పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన శ్రేణులు కేరింతలు కొడుతూ, పీఎం పీఎం అని కేకలు పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.
కాగా చాలామంది లాగే జానీ మాస్టర్ కూడా పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. ఆయనతో కలిసి పలు సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా పని చేశారు మాస్టర్. ఆ తర్వాత పవన్ స్థాపించిన జనసేన పార్టీలో కూడా చేరారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జనసేన తరఫున నెల్లూరులో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సమయంలో కాకుండా ఎన్నికల ముందే నెల్లూరులో వాడవాడలా తిరిగారు. కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సహాయ సహకారాలు అందజేశారు.
జానీ మాస్టర్ కామెంట్స్.. వీడియో ఇదిగో..
పవన్ కళ్యాణ్ 2029లో సీఎం అవుతాడు.. 2034లో ప్రధానమంత్రి అవుతాడు – జాని మాస్టర్ pic.twitter.com/FtAENX5wJH
— Telugu Scribe (@TeluguScribe) September 3, 2024
ఇక పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా సోమవారం ‘గబ్బర్ సింగ్’ మూవీ రీరిలీజ్ అయ్యింది. దీంతో థియేటర్లలో పవన్ ఫ్యాన్స్ సందడి మాములుగా లేదు. పలువురు అభిమానులు గబ్బర్ సింగ్ గెటప్ వేసుకుని థియేటర్లకు వచ్చారు.
రక్తదాన కార్యక్రమంలో జానీ మాస్టర్..
ఈ రోజు నెల్లూరు గంగపట్నం లో కళ్యాణ్ అన్న పుట్టిన రోజు సందర్భంగా దాదాపు 1000 మందితో జరిగిన రక్త దాన కార్యక్రమంలో పాల్గొన్నాము.
ప్రజల ఆశీస్సులతో పాటు దేవుని ఆశీర్వాదం కూడా ఆయనకి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమయానికి అవసరపడే సహాయాన్ని అందించడానికి ఈ కార్యక్రమానికి… pic.twitter.com/cIrHXjuAot
— Jani Master (@AlwaysJani) September 2, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.