Jani Master: జానీ మాస్టర్ గొప్ప మనసు.. నడుములోతు నీళ్ల‌లోనూ నడిచి వెళ్లి బాధితులకు ఆహారం పంపిణీ.. వీడియో

ప్ర‌ముఖ కొరియోగ్రాపర్, జనసేన నేత జానీ మాస్టర్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. వరద ప్రవాహంలోనూ నడుములోతు నీళ్ల‌లోనూ నడుచుకుంటూ వెళ్లి వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. వారికి భరోసా అందించారు. తన వంతు సాయంగా 500 కుటుంబాల‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను పంపిణీ చేశారు

Jani Master: జానీ మాస్టర్ గొప్ప మనసు.. నడుములోతు నీళ్ల‌లోనూ నడిచి వెళ్లి బాధితులకు ఆహారం పంపిణీ.. వీడియో
Jani Master
Follow us
Basha Shek

|

Updated on: Sep 07, 2024 | 8:29 AM

భారీ వర్షాలు, వరదలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని పలు ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది. విజయవాడ అజిత్‌ సింగ్‌ నగర్‌తో పాటు చుట్టు ప‌క్క‌ల ప్రాంతాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతోంది. అలాగే పలువురు దాతలు తమ వంతు సాయంగా విరాళాలు ఇస్తున్నారు. సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు వరద బాధితుల కోసం సీఎం వరద సహాయ నిధికి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఇక సందీప్ కిషన్ లాంటి సినీ ప్రముఖులు తమ టీమ్ లను వరద ప్రభావిత ప్రాంతాలకు పంపి బాధితులకు ఆహారం, వాటర్ సప్లై చేస్తున్నారు. ఈక్రమంలోనే ప్ర‌ముఖ కొరియోగ్రాపర్, జనసేన నేత జానీ మాస్టర్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. వరద ప్రవాహంలోనూ నడుములోతు నీళ్ల‌లోనూ నడుచుకుంటూ వెళ్లి వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. వారికి భరోసా అందించారు. తన వంతు సాయంగా 500 కుటుంబాల‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను పంపిణీ చేశారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో పార్టీల‌కు అతీతంగా అంద‌రూ వరద బాధితులకు సాయం చేయాల‌ని కోరారు. ఇందుకు సంబంధించిన వీడియోను జనసేన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు జానీ మాస్టర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

‘వరద ఉధృతి కి మునిగిన రామవరప్పాడు, సింగినగర్, విజయవాడ ప్రాంతాల్లో మా జనసేన నాయకులతో తిరిగి 500 కుటుంబాలకి సరిపడే నిత్యావసర సరుకులని పంపిణీ చేసాం. అక్కడి పరిస్థితులని మాటల్లో చెప్పలేం, వచ్చి చూస్తే కానీ తెలియదు. చాలా కష్టపడి, ఇష్టపడి కట్టుకున్న సొంతిల్లు మునిగిపోయి, అయినవారిని, ఆసరాని కోల్పోయి చాలా తల్లడిల్లిపోతున్నారు. పార్టీలకి అతీతంగా అందరూ సహాయపడాల్సిన సమయమిది. పవన్ కల్యాణ్ అన్న సహాయం ప్రతి ఒక్కరికీ చేరాలనే ఉద్దేశంతో మా జనసేన శ్రేణులు, మా వీర మహిళల్ని ఇక్కడకి పంపించారు. వీరందరికీ ఈ సమయంలో భరోసానివ్వడం వదిలేసి మాటలనుకోవడం వల్ల ప్రయోజనం లేదు. అందరూ తోచినంత సాయం చేస్తే ఈ పరిస్థితి నుండి వీరు త్వరగా కోలుకుంటారు’ అని పిలుపు నిచ్చారు జానీ మాస్టర్.

ఇవి కూడా చదవండి

వరద ప్రభావిత ప్రాంతాల్లో జానీ మాస్టర్..  వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.