లావణ్యకు ఇలా దొరికేశాడేంటి.! మాల్వీ ఫ్లాట్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన రాజ్‌తరుణ్.. వీడియో వైరల్

ట్రయాంగిల్ లవ్ ఫైట్ ఇన్ ముంబై. అవును.. ఇంతకాలం హైదరాబాద్‌ సెంటర్‌గా నడిచిన రాజ్ తరుణ్, లావణ్య కాంట్రవర్సీ.. లేటెస్ట్‌గా ముంబైకి చేరింది. లావణ్య రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

లావణ్యకు ఇలా దొరికేశాడేంటి.! మాల్వీ ఫ్లాట్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన రాజ్‌తరుణ్.. వీడియో వైరల్
Raj Tarun & Lavanya Case
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 07, 2024 | 8:25 AM

రాజ్‌ తరుణ్, లావణ్య వివాదంలో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు వీరి మధ్య నెలకొన్న కాంట్రవర్సీకి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ వచ్చింది. అయితే తాజాగా ఈ ఎపిసోడ్‌ ముంబైకు షిఫ్ట్ అయ్యింది. రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్రా ఒకే ఫ్లాట్‌లో ఉండగా పట్టుకున్నానని లావణ్య తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను లావణ్య రిలీజ్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. లావణ్య విడుదల చేసిన వీడియోలో రచ్చ ఓ రేంజ్‌లో ఉంది. రాజ్ తరుణ్ తనవాడే అంటూ మాల్వీ మల్హోత్రాతో వాగ్వాదానికి దిగింది లావణ్య. మా ఇద్దరి మధ్య 11 ఏళ్ల రిలేషన్‌షిప్ ఉందంటూ చెప్పుకొచ్చింది. రాజ్‌ తరుణ్‌ను వదిలేయాలని మాల్వీకి వార్నింగ్ ఇచ్చింది. అయితే గెట్ ఔట్‌ అంటూ లావణ్యకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది మాల్వీ.

రాజ్‌తరుణ్‌ కూడా అదే ఫ్లాట్‌లో ఉండటాన్ని రికార్డ్ చేసిన లావణ్య.. వాళ్ల మధ్య సంబంధానికి ఈ దృశ్యాలే సాక్ష్యమంటోంది. రాజ్‌తరుణ్‌, మాల్విని పట్టుకునేందుకు తండ్రితో కలిసి లావణ్య ముంబై వెళ్లింది. అయితే లావణ్య తమను ఇబ్బందిపెడుతోందంటూ మాల్వీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో లావణ్య తండ్రిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రాజ్‌తరుణ్‌పై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు.. అతడిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. తనను ప్రేమించి, మోసం చేశారని లావణ్య చేసిన ఆరోపణల్లో నిజం ఉందని పోలీసులు నిర్ధారించారు. లావణ్య, రాజ్‌తరుణ్‌ పదేళ్లుగా ఒకే ఇంట్లో ఉన్నట్లుగా తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. దర్యాప్తులో భాగంగా లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు, పలు కీలక ఆధారాలు కూడా సేకరించినట్లు చార్జ్‌షీట్‌లో ప్రస్తావించారు. అయితే తాజాగా ఈ వివాదంలో కొత్త ట్విస్ట్ తెరపైకి రావడంతో.. ఈ ఎపిసోడ్‌లో ఇంకెన్ని మలుపులు ఉంటాయో అనే ఆసక్తి నెలకొంది.