అభిమానులను నిరాశకు గురి చేసిన మహేష్ బాబు..ఎందుకంటే?
తెలుగు తెర మీద కూడా సంక్రాంతి సందడి గట్టిగా కనిపిస్తోంది. పండుగ సినిమాలతో పాటు లేటెస్ట్ అప్‌డేట్స్‌తో అందరు హీరోల అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ జోష్ సూపర్ స్టార్ అభిమానుల్లో మాత్రం కనిపించటం లేదు. సంక్రాంతికైనా ఏదైనా అప్‌డేట్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేసిన మహేష్ ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశ తప్పలేదు.
Updated on: Jan 15, 2025 | 8:29 PM

లాస్ట్ ఇయర్ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన మహేష్, ఆ తరువాత మళ్లీ తన సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. అప్పటికే ఎనౌన్స్ అయిన రాజమౌళి సినిమా కోసం ప్రీపేర్ అవుతున్న విషయం చెబుతున్నా... ఆ సినిమాకు సంబంధించి ఒక్క అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా రాలేదు.

ఈ మధ్యే ఎస్ఎస్ఎంబీ 29ను లాంఛనంగా ప్రారంభించింది యూనిట్. ఆ రోజు కూడా ఎలాంటి అప్‌డేట్ రాకపోవటంతో సంక్రాంతి రోజు లాంచింగ్ ఈవెంట్‌కు సంబంధించిన గ్లింప్స్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేశారు అభిమానులు. కానీ ఆ ఆశలు కూడా నెరవేరలేదు. మినిమమ్ మరో రెండేళ్ల పాటు మహేష్ ఫ్యాన్స్‌కి ఈ నిరాశ తప్పదంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

ఇప్పటికే జక్కన్న సినిమా కోసం మేకోవర్ అయిన మహేష్... యాక్షన్, డైలాగ్స్ విషయంలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వన్స్, ఆల్ సెట్ అనుకుంటే షూటింగ్ స్టార్ట్ చేస్తారు.

ఇప్పటికే జక్కన్న సినిమా కోసం మేకోవర్ అయిన మహేష్... యాక్షన్, డైలాగ్స్ విషయంలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వన్స్, ఆల్ సెట్ అనుకుంటే షూటింగ్ స్టార్ట్ చేస్తారు.

అందుకోసమే ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారు. జక్కన్న ప్లానింగ్ ఏదైనా.. పండుగను ఫేవరెట్ హీరో అప్‌డేట్‌తో సెలబ్రేట్ చేసుకోవాలనుకునే సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు మాత్రం నిరాశ తప్పటం లేదు.