Mahesh Babu: బాలీవుడ్ బ్యూటీకి క్రేజీ ఛాన్స్.. మహేష్ సరసన ఆ స్టార్ హీరోయిన్.. జక్కన్న ప్లాన్ భలే ఉందే..
లాంగ్ హెయిర్‌తో అచ్చం హాలీవుడ్ రేంజ్ హీరోగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరలవుతుంది.
ట్రిపుల్ ఆర్ తర్వాత డైరెక్టర్ రాజమౌళి రూపొందించే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకున్న జక్కన్న.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తర్వాతి సినిమా చేయనున్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోయే పాన్ వరల్డ్ సినిమా పై నిత్యం ఏదోక వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ చిత్రం కోసం మహేష్ కొన్నిరోజులుగా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పటికే మహేష్ లుక్ పూర్తిగా మారిపోయింది. లాంగ్ హెయిర్‌తో అచ్చం హాలీవుడ్ రేంజ్ హీరోగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరలవుతుంది.
మహేష్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరనేది ఇప్పటివరకు తెలియరాలేదు. కానీ ఇప్పుడు ఓ బాలీవుడ్ బ్యూటీ పేరు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు..ఇప్పుడిప్పుడు సౌత్ ఇండస్ట్రీలో సత్తా చాటేందుకు రెడీ అయిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. బీటౌన్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న ఈ తార.. ఇప్పుడు దక్షిణాదిలో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తుంది జాన్వీ. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోయే ఆర్సీ 16 ప్రాజెక్టులోనూ కనిపించనుంది.
ఇక ఇప్పుడు మహేష్ , రాజమౌళి మూవీలోనూ నటించనుందని తెలుస్తోంది. దేవర, ఆర్సీ 16 సినిమాలతోపాటు ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 16లోనూ ఈ బ్యూటీని సెలక్ట్ చేయాలని భావిస్తున్నాడట రాజమౌళి. ప్రస్తుతం మహేష్ సినిమా కోసం జాన్వీని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట జక్కన్న. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రాబోతున్న దేవర చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు. పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా తర్వాత తెలుగులో జాన్వీకి మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.