AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghuvaran: తండ్రిని గుర్తుచేస్తోన్న విలన్ రఘువరన్ తనయుడు.. అచ్చం హీరోలా ఉన్నాడే.. ఫోటోస్ వైరల్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమాలో హీరో తండ్రి పాత్రలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించి అసాధారణమైన నటనతో మెప్పించాడు. నటుడిగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన రఘువరన్ 50 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో 2008లో ఆకస్మాత్తుగా మరణించారు.

Raghuvaran: తండ్రిని గుర్తుచేస్తోన్న విలన్ రఘువరన్ తనయుడు.. అచ్చం హీరోలా ఉన్నాడే.. ఫోటోస్ వైరల్..
Raghuvaran
Rajitha Chanti
|

Updated on: Jun 02, 2024 | 9:34 AM

Share

రఘువరన్.. ఒకప్పుడు దక్షిణాదిలో మారుమోగిన పేరు. 80’s, 90’sలో సౌత్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ విలన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల్లో చాలావరకు నెగిటివ్ పాత్రలు పోషించినప్పటికీ కమల్ హాసన్, రజినీకాంత్, పవన్ కళ్యాణ్, చిరంజీవి వంటి హీరోలకు సమానంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అలాగే సినిమాల్లో తండ్రిగా, అన్నగా క్యారెక్టర్ రోల్స్ పోషించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమాలో హీరో తండ్రి పాత్రలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించి అసాధారణమైన నటనతో మెప్పించాడు. నటుడిగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన రఘువరన్ 50 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో 2008లో ఆకస్మాత్తుగా మరణించారు. సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన రఘువరన్ నిజజీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోన్నాడు.

రఘువరన్ 1996లో తన తోటి నటి రోహిణి మొల్లేటిని వివాహం చేసుకున్నారు. వీరికి 1998లో రిషివరన్ అనే కుమారుడు జన్మించాడు. వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మనస్పర్థలతో 2004లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరి విడిపోయిన తర్వాత రిషివరన్ తన తల్లివద్దే పెరిగాడు. ప్రస్తుతం రిషివరన్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. రిషివరన్ హైట్, స్టైల్ లో అచ్చం అతడి తండ్రిలా కనిపిస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. రిషివరన్ తల్లిదండ్రుల మాదిరిగానే నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. అతడికి సంగీతం ఆసక్తి ఎక్కువ. ఇప్పటికే ఇంగ్లీష్ ఆల్బమ్స్ రిలీజ్ చేశాడు. ఫాదర్ సన్ బారిన్ అనే ఆల్బమ్ మంచి హిట్ అయ్యింది.

Rishivaran

Rishivaran

మొదట్లో రఘువరన్ కూడా సంగీతం వైపు ఆకర్షితుడయ్యాడు. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో అద్భుతమైన నటులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు రఘువరన్ తనయుడు కూడా సంగీతం పట్ల ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రఘువన్ మితిమీరిన మద్యపానం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో 2008లో గుండెపోటుతో మరణించారు. తెలుగులో సుస్వాగతం, ఆహా, శివ, నాగ, జానీ, మాస్ వంటి చిత్రాల్లో నటించారు రఘువరన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.