Jagapathi Babu: ఏంటీ.. నన్ను మళ్లీ మార్కెట్లో పెడతావా.. ? ఆ హీరోయిన్‌కు జగ్గు భాయ్ కౌంటర్..
టాలీవుడ్ సినీప్రియులకు ఇష్టమైన సీనియర్ హీరోలలో జగపతి బాబు ఒకరు. ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్.. విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన జగ్గుభాయ్.. ఆ తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. ప్రస్తుతం సహాయ పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంటున్నాడు.

తెలుగు సినీరంగంలో ఒకప్పుడు హిట్ పెయిర్‌గా నిలిచిన జంటలలో జగపతి బాబు, ఆమని జోడి ఒకటి. టాలీవుడ్ సినీప్రియుల మదిలో ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిన పోయిన అందమైన జంట వీరిది. ఇద్దరూ కలిసి నటించిన శుభలగ్నం, మావిచిగురు, తీర్పు సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రాల్లోని సాంగ్స్ సైతం ఎవర్ గ్రీన్ హిట్. అందుకే వీరి కాంబోకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు ఇద్దరూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో సహయ పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నారు. తండ్రిగా పాజిటివ్ రోల్స్.. అలాగే పవర్ ఫుల్ విలన్ పాత్రలతో వెండితెరపై రఫ్పాడిస్తున్నారు జగ్గు భాయ్. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలోనూ విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటు ఆమని సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. తాజాగా వీరిద్దరికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
చాలా కాలం తర్వాత జగపతి బాబు, ఆమని ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఆ సిరీస్ షూటింగ్ సమయంలో ఇద్దరు కలిసి ఫన్నీగా ఓ వీడియోస్ చేశారు. ఆమని కోసం మేకప్ మ్యాన్ గా టచ్ అప్ బాయ్ గా మారిపోయారు జగ్గు భాయ్. ఇక ఆమని ఠీవీగా కాలు మీద కాలేసుకుని చైర్ లో కూర్చొని, మొబైల్ చూస్తుంటే.. ఆయన మాత్రం పక్కనే నిలబడి ఆమెకు గొడుగు పట్టి టచ్ అప్ చేస్తున్నాడు. ఇక ఆ సమయంలో గొడుగు సరిగ్గా పట్టుకో అంటూ చిరాకు పడింది ఆమని. మేకప్ సరిగ్గా వేయి.. లేకపోతే నేను వేరే అసిస్టెంట్ ను పెట్టుకుంటాను అంటూ చిరాకు పడిపోయింది. ఇక ఇప్పుడు ఆమనికి కౌంటర్ ఇస్తూ మరో వీడియో షేర్ చేశారు జగపతి బాబు.
ఇందులో జగ్గు భాయ్ కు టప్ అప్ చేస్తూ కనిపించింది ఆమని. ఆయన కుర్చీలో కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చుంటే ఆమని గొడుగు పడుతూ టచ్ అప్ చేస్తోంది. మేకప్ వేయమంటే బొట్లు పెడుతున్నావా ఏంటీ.. నీ వల్ల కాకపోతే చెప్పు మేనేజర్ కు చెప్పి నిన్ను మార్చేస్తా.. అని బెదిరిస్తున్నాడు జగపతి బాబు. వద్దు సార్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది ఆమని. అద్దం చూపిస్తూ సార్ బాగుందా అని ఆమని అడగ్గా.. నీ మొహంలాగే ఉంది.. నన్ను కోటి రూపాయలకు అమ్మేస్తావా అంటూ కౌంటరివ్వడంతో అక్కడున్నవారంతా ఠక్కున నవ్వేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. మేకప్ వేస్తున్నావ్ ఏంటీ.. మళ్లీ మార్కెట్ లో పెడతావా ఏంటీ ? అంటూ క్యాప్షన్ ఇచ్చారు జగ్గుభాయ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. శుభలగ్నం సినిమా గుర్తుకు తెస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..