Rocking Rakesh: అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ.. తన సినిమా పోస్టర్స్ తనే గోడ మీద అతికిస్తోన్న రాకింగ్ రాకేష్

మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాడు రాకేష్. జబర్దస్త్ తో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు తనను హీరోగా సిల్వర్ స్క్రీన్‌పై చూసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం తన ఇంటిని కూడా తాకట్టు పెట్టాడు జబర్దస్త్ రాకింగ్ రాకేష్.

Rocking Rakesh: అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ.. తన సినిమా పోస్టర్స్ తనే గోడ మీద అతికిస్తోన్న రాకింగ్ రాకేష్
Rocking Rakesh
Follow us
Basha Shek

|

Updated on: Nov 20, 2024 | 2:48 PM

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్ కూడా ఒకటి. ముఖ్యంగా చిన్న పిల్లలను టీమ్‌లోకి తీసుకుని వారితో కలిసి అతను చేసిన స్కిట్స్ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. ఇక ఇదే జబర్దస్త్ వేదికపై తనతో కలిసి స్క్రీన్‌ పంచుకున్న జోర్దార్ సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే వీరి జీవితంలోకి ఒక పండంటి ఆడబిడ్డ కూడా అడుగు పెట్టింది. ఆ అమ్మాయికి ఖ్యాతిక అని పేరు కూడా పెట్టుకున్నారీ జబర్దస్త్ కపుల్. ఇప్పటివరకు తన కామెడీతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన రాకింగ్ రాకేష్ ఇప్పుడు హీరోగా అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. తనే హీరోగా, నిర్మాతగా KCR (కేశవ చంద్ర రమావత్) పేరుతో ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ తో ఒక సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కేసీఆర్ సినిమా చాలా సార్లు వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఈ శుక్రవారం (నవంబర్22)న రాకింగ్ రాకేష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఉన్నంతలో ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. ఇటీవలే హైదరాబాద్ వేదికగా కేసీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాడు. మాజీ మంత్రులు హరీష్ రావు, రోజా, జానీ మాస్టర్, సుడిగాలి సుధీర్, అదిరే అభి.. ఇలా రాజకీయ, సినీ ప్రముఖులందరూ వచ్చి ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాక్షించారు.

కాగా కేసీఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాకింగ్ రాకేష్, అతని సతీమణి జోర్దార్ సుజాతలే యాంకర్లుగా వ్యవహరించడం గమనార్హం. ఎందుకంటే ఈ సినిమా కోసం తన ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చానని, తాను సంపాదించింది అంతా సినిమాలో పెట్టానని గతంలో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు రాకింగ్ రాకేష్. అందుకే తమ సినిమా ఈవెంట్ కు తామే యాంకర్లుగా చేస్తున్నామంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాకేష్ చాలా ఎమోషనల్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

అర్ధరాత్రి హైదరాబాద్ రోడ్డపై తిరుగుతూ..

View this post on Instagram

A post shared by Tag Telugu (@tag.telugu)

తాజాగా రాకింగ్ రాకేష్ అర్ధరాత్రి పూట హైదరాబాద్ రోడ్ల మీద నడుస్తూ తన కేసీఆర్ సినిమా పోస్టర్స్ ని తానే గోడలకు అతికించుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇప్పటికే తన సినిమాకు చాలా ఖర్చు పెట్టేసాడని , ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు అయినా తగ్గించుకునేందుకే రాకేష్ ఇలా కష్టపడుతున్నాడు అంటూ పలువురు అతనిని సపోర్ట్ చేస్తున్నారు. అదే సమయంలో ఇది కూడా కొత్తరకం ప్రమోషన్స్ అని అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

హరీష్ రావుతో రాకింగ్ రాకేష్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.