AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Singh: మూడు సార్లు ఆత్మహత్య చేసుకుందామనుకున్నా.. రక్తం కారుతున్నా అలానే..

ప్రియాంక సింగ్ ఒకరు అలియాస్ పింకీ. జబర్దస్త్ ద్వారా ప్రియాంక మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత బిగ్ బాస్ షో ప్రియాంకా క్రేజ్ ను డబుల్ చేసింది. బిగ్ బాస్ తర్వాత ప్రియాంక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. హీరోయిన్స్ కూడా అసూయపడేలా అందంతో ఆకట్టుకుంటుంది ప్రియాంక. తాజాగా ప్రియాంకా సింగ్ ఓ యూట్యూబర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Priyanka Singh: మూడు సార్లు ఆత్మహత్య చేసుకుందామనుకున్నా.. రక్తం కారుతున్నా అలానే..
Priyanka Singh
Rajeev Rayala
|

Updated on: Feb 15, 2024 | 6:09 PM

Share

జబర్దస్త్ షో ద్వారా చాలా మంది క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాగే ఈ కామెడీ షోలో కొంతమంది లేడీ గెటప్స్ లోనూ మెప్పించారు. వారిలో కొంతమంది నిజంగానే అమ్మాయిలుగా మారారు. వారిలో ప్రియాంక సింగ్ ఒకరు అలియాస్ పింకీ. జబర్దస్త్ ద్వారా ప్రియాంక మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ షో ప్రియాంకా క్రేజ్ ను డబుల్ చేసింది. బిగ్ బాస్ తర్వాత ప్రియాంక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. హీరోయిన్స్ కూడా అసూయపడేలా అందంతో ఆకట్టుకుంటుంది ప్రియాంక. తాజాగా ప్రియాంకా సింగ్ ఓ యూట్యూబర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన జీవితంలో ఎన్నో సమస్యలు, ఆటుపోట్లు చూశానని తెలిపింది ప్రియాంక.

ప్రియాంకా సింగ్ ఓ వైపు టీవీ షోలు చేస్తూ బిజీగా మారింది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. రకరకాల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది ప్రియాంక.. తాజాగా ప్రియాంక మాట్లాడుతూ.. ఎన్నో ఆటు పోట్లు, అవమానాలు ఎదుర్కొని.. దైర్యంగా ఈరోజు అమ్మాయిగా సొసైటీలో తిరుగుతున్నా అని తెలిపింది ప్రియాంక.

చిన్నప్పుడు తన అక్క స్కూల్ నుంచి రాగానే తన డ్రస్సులు వేసుకునేదాన్ని.. అలా రాను రాను అమ్మాయిలా మారాలని అనిపించింది. పడవ తరగతి తర్వాత హైదరాబాద్ వచ్చి మేకప్ ఆర్టిస్ట్ గా పని చేశాను అని తెలిపింది ప్రియాంక. ఆతర్వాత జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేశాను. ఆ డబ్బులతోనే సర్జరీ చేయించుకున్నా.. సర్జరీ సమయంలో విపరీతమైన నొప్పితో విలవిలలాడిపోయాను. హాస్పటల్ లో పట్టించుకునేవాళ్ళు కూడా లేరు. రక్తం కారుతున్నా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో నడుచుకుంటూ వెళ్ళాను అని తెలిపింది. అలాగే ఒకానొక సమయంలో ఆరోగ్యం బాగా దెబ్బతింది. అప్పుడు చాలా సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. అక్కడి నుంచి మళ్లీ ఒకొక్క మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చాను అని తెలిపింది ప్రియాంక. అలాగే తన జీవితంలో మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలని చూశా అని తెలిపింది. మొదటిసారి స్కూల్ లో అందరూ ఏమని ఏడిపించారో . మా నాన్న కూడా అదే మాట అనేసరికి చచ్చిపోవాలనిపించింది దాంతో కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకున్నా.. దాదాపు 60 శాతం నా శరీరం కాలిపోయింది. ఆతర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నా.. రెండో సారి లవ్ లో ఫెయిల్ అయ్యాను అప్పుడు.. మరోసారి సర్జరీ చేశయించుకున్న తర్వాత ఆర్థరైటిస్ రావడంతో .. ఆ  బాధ తట్టుకోలేకపోయాను అప్పుడు కూడా చచ్చిపోదామనుకున్నా అని తెలిపింది ప్రియాంక. అలాగే ఇప్పుడు వరుసగా సినిమాల్లో ఛాన్స్ లు వస్తున్నాయని తెలిపింది.

ప్రియాంక సింగ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.