AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika: రష్మిక కు అరుదైన గౌరవం, ఫోర్బ్స్ జాబితాలో నేషనల్ క్రష్

నేషనల్ క్రష్ రష్మిక క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లోనూ దూసుకుపోతోంది ఈ బ్యూటీ. ఇటీవల యానిమల్ మూవీలో గీతాంజలిగా మెప్పించి ఆకట్టుకుంది. తాజాగా రష్మిక మందన్న ఫిబ్రవరి 2024  ఫోర్బ్స్ ఇండియాలో చోటు దక్కించుకుంది. అండర్ 30 జాబితాలో చోటు సంపాదించుకొని ఆశ్చర్యపర్చింది. 

Rashmika: రష్మిక కు అరుదైన గౌరవం, ఫోర్బ్స్ జాబితాలో నేషనల్ క్రష్
Rashmika Mandanna
Balu Jajala
|

Updated on: Feb 15, 2024 | 6:34 PM

Share

నేషనల్ క్రష్ రష్మిక క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లోనూ దూసుకుపోతోంది ఈ బ్యూటీ. ఇటీవల యానిమల్ మూవీలో గీతాంజలిగా మెప్పించి ఆకట్టుకుంది. తాజాగా రష్మిక మందన్న ఫిబ్రవరి 2024  ఫోర్బ్స్ ఇండియాలో చోటు దక్కించుకుంది. అండర్ 30 జాబితాలో చోటు సంపాదించుకొని ఆశ్చర్యపర్చింది.  27 ఏళ్ల  నటి తన ప్రతిభతో ప్రేక్షకులను ఆకర్షిస్తూ  భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోయిన్ గా వెలుగొందుతుంది.

“పుష్ప: ది రైజ్”  “యానిమల్” వంటి బ్లాక్ బస్టర్లలో అందర్నీ ఆకట్టుకుంది. రష్మిక ఇప్పటికే భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకొని తానేంటో ప్రూవ్ చేసుకుంది. అద్భుతమైన నలుపు రంగు స్లీవ్‌లెస్ దుస్తులు ధరించి, ఫోర్బ్స్ పబ్లికేషన్‌లో హోయలు ఒలకబోసింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి “పుష్ప 2: ది రూల్”లో మరోసారి ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

సినిమా, క్రీడలు, మీడియా, ఫ్యాషన్ రంగాలకు ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రభావితచేసిన వ్యక్తులను గుర్తించి జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో రష్మిక మందన్న టాప్ లో ఉండటం విశేషం. ఛలో సినిమాతో టాలీవుడ్ లో సక్సెస్ కొట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస అవకాశాలను దక్కించుకుంటోంది. గీతగోవిందం, పుష్ప, యానిమల్ లాంటి హిట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలోను ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఏమాత్రం సమయం దొరికినా అభిమానులతో చిట్ చాట్ చేస్తూ టచ్ లో ఉంటుంది. అయితే ఈ బ్యూటీ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండను పెళ్లిచేసుకోబోతున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నా.. జస్ట్ వీ ఆర్ ఫ్రెండ్స్ అంటూ రియాక్ట్ అవుతుందే తప్ప రిలేషన్ పై క్లారిటీ ఇవ్వకుండా దాటవేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప పార్ట్-2 సినిమాతో బిజీగా ఉంది.

Follow Us
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి