Nidhhi Agerwal : నితిన్‌కు జోడీ ఇస్మార్ట్ బ్యూటీ.. మాచర్ల నియోజక వర్గంలో ఆ హీరోయిన్..

యంగ్ హీరో నితిన్ రీసెంట్‌గా మ్యాస్ట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాలీవుడ్ మూవీకి రీమేక్‌గా వచ్చిన ఈసినిమా ఓటీటీ వేదికగా నిన్న (శుక్రవారం ) విడుదలైంది.

Nidhhi Agerwal : నితిన్‌కు జోడీ ఇస్మార్ట్ బ్యూటీ.. మాచర్ల నియోజక వర్గంలో ఆ హీరోయిన్..
Nithin
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 18, 2021 | 9:56 AM

Nidhhi Agerwal : యంగ్ హీరో నితిన్ రీసెంట్‌గా మ్యాస్ట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాలీవుడ్ మూవీకి రీమేక్‌గా వచ్చిన ఈసినిమా ఓటీటీ వేదికగా నిన్న (శుక్రవారం ) విడుదలైంది. ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ కుర్ర హీరో. ఏడాది ప్రారంభంలో చెక్ సినిమాను రిలీజ్ చేశారు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత వచ్చిన రంగ్ దే సినిమా పర్లేదు అనిపించుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తిసురేష్ నటించింది. ఇక ఇప్పుడు మ్యాస్ట్రో సినిమాతో వచ్చాడు నితిన్. అలాగే తన నెక్స్ట్ సినిమాను కూడా లైన్‌లోపెట్టాడు ఈ యంగ్ హీరో. నితిన్ హీరోగా ఎస్.ఆర్.శేఖర్ దర్శకత్వంలో ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా రూపొందుతోంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ ప్రాజెక్టు, ఇటీవలే పట్టాలెక్కింది. నితిన్ సొంత బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టి  నటిస్తుందిని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో విలన్‌గా సముద్రఖని పేరు వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నాడని అంటున్నారు.

అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండనుందట. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కనిపించనుందని తెలుస్తుంది. సవ్యసాచి’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాల తర్వాత వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నిధి అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ప్రస్తుతం నిధి టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీలో హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది ఈ బ్యూటీ.  అలాగే తెలుగు సినిమాలతోపాటు తమిళ్‌లోనూ సినిమాలు చేస్తుంది నిధి.Nidhi

Nidhiమరిన్ని ఇక్కడ చదవండి : 

Samantha Akkineni: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్టార్ హీరోయిన్ సమంత..

Rakul Preet Singh: అందుకోసం డాక్టర్లను ఫాలో అయ్యాను.. నేను రకుల్‏ను మాత్రం కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరోయిన్..

Pooja Hegde: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‏తో షూరు చేసిన బుట్టుబొమ్మ.. ఇకపై సొంత గళాన్ని వినిపించనున్న పూజా హెగ్డే..