NTR : నీల్ మావ పెద్ద ప్లానే వేశాడు.. ఎన్టీఆర్ డ్రాగన్‌లో బాలయ్య బాబు హీరోయిన్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత మోస్ట్ అవైటెడ్ మూవీ వార్ 2 షూటింగ్లో జాయిన్ అయ్యారు. కొన్ని నెలలుగా ఈ మూవీ కోసం ముంబైలో సందడి చేశారు ఎన్టీఆర్. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.

మ్యాన్ ఆఫ్ మిసెస్ ఎన్టీఆర్ సినిమా కోసం ఫ్యాన్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం తారక్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ మూవీ వార్ 2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాల షూటింగ్స్ తో బిజీగాఉన్నాడు. ఆతర్వాత దేవర 2 సినిమాలో నటించనున్నాడు తారక్. ఇటీవలే దేవర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తారక్ , ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశాడు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న వార్ 2 లో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వార్ 2 టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లో తారక్ అదరగొట్టాడు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు.
కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలతో హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు తారక్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను ఇటీవలే మొదలు పెట్టారు. ఈ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రశాంత్ ఈ సినిమాను తన గత సినిమాల మాదిరిగానే యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.
మొన్నీమద్యే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు కూడా.. సైలెంట్ గా డ్రాగన్ సినిమా షూటింగ్ ను జరుపుతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో స్టార్ కాస్ట్ నటిస్తున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండనుందని తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలో ఓ బాలీవుడ్ నటి కూడా నటిస్తుందని తెలుస్తుంది. డ్రాగన్ సినిమాలో కీలక పాత్రలో ఆమె నటిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ విద్యాబాలన్. డర్టీ పిచ్చర్ సినిమాతో పాపులర్ అయ్యింది విద్యాబాలన్. ఇదే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది. అలాగే బాలకృష్ణ నటించిన కథానాయకుడు సినిమాలో నటించింది విద్య బాలన్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో కీలక పాత్ర కోసం విద్యను సంప్రదించారని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి



