Nikhil Siddhartha: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తండ్రి కాబోతున్నడా..?
ఇటీవల టాలీవుడ్ లో శుభవార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు పెళ్లి పీటలు ఎక్కినా విషయం తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ, హీరోయిన్ లావణ్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. దాంతో మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ కుష్ అవుతున్నారు. ఈ పెళ్ళిలో మెగా హీరోలందరూ ఓకే ఫ్రెమ్ లో కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే యంగ్ హీరో శర్వానంద్ కూడా ఇదే ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. శర్వానంద్ ఇప్పుడు తండ్రి […]

ఇటీవల టాలీవుడ్ లో శుభవార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు పెళ్లి పీటలు ఎక్కినా విషయం తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ, హీరోయిన్ లావణ్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. దాంతో మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ కుష్ అవుతున్నారు. ఈ పెళ్ళిలో మెగా హీరోలందరూ ఓకే ఫ్రెమ్ లో కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే యంగ్ హీరో శర్వానంద్ కూడా ఇదే ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. శర్వానంద్ ఇప్పుడు తండ్రి కాబోతున్నాడని కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. శర్వానంద్ భార్య అమెరికాలో బిడ్డకు జన్మనివ్వనుందని కూడా వార్తలు వచ్చాయి.
ఇప్పుడు మరో హీరో తండికాబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ హీరో మరెవరో కాదు నిఖిల్. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవలే కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. స్వయంభూసినిమాతో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే నిఖిల్ 2020లో పల్లవి వర్మను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. యంగ్ హీరో నిఖిల్ తండ్రి కాబోతున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. నిఖిల్ సతీమణి ఇటీవలే ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు వెళ్ళింది. అక్కడ ఆమె బేబీ బంప్ తో కనిపించారని నిఖిల్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు. దాంతో నిఖిల్ తండ్రి కాబోతున్నడన్న ప్రచారం జోరందుకుంది. దీని పై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.
View this post on Instagram
నిఖిల్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




