AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమన్నాను వదిలేసి.. ఆ హీరోయిన్‌ను లైన్‌లో పెట్టాడు.. టాలీవుడ్ విలన్ మామూలోడు కాదు..

మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది.

తమన్నాను వదిలేసి.. ఆ హీరోయిన్‌ను లైన్‌లో పెట్టాడు.. టాలీవుడ్ విలన్ మామూలోడు కాదు..
Tamannaah Bhatia
Rajeev Rayala
|

Updated on: Jun 22, 2025 | 9:00 AM

Share

అందాల భామ తమ్మన్న ప్రస్తుతం బాలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఈ చిన్నది తెలుగులో ఒకప్పుడు తోప్ హీరోయిన్.. చేసిన సినిమాలనే సూపర్ హిట్స్.. దాంతో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.  మంచు మనోజ్ నటించిన శ్రీ సినిమాతోయ్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది తమన్నా. ఆతర్వాత హ్యాపీడేస్ సినిమా ఈ చిన్నదానికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆతర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం  హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ తమన్నా తన సత్తా చాటింది. ఈ చిన్నది చేసిన స్పెషల్ సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ మధ్య బాలీవుడ్ లో ఎక్కువ సందడి చేస్తుంది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే మొన్నటివరకు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉంది తమన్నా..

ఇది కూడా చదవండి : అప్పుడు మాస్ రాజా సినిమాలో సైడ్ రోల్.. ఇప్పుడు స్టార్ హీరో.. ఏకంగా రవితేజ మూవీలో గెస్ట్ గా..

తమన్నా, విజయ్ వర్మ చట్టపట్టాలేసుకు తిరుగుతూ మీడియా కంటపడ్డారు. అలాగే ఈ ఇద్దరూ కలిసి ఓ వెబ్ సిరీస్ లోనూ నటించారు. ఇక ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. కానీ ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు షికారు చేశాయి. వాటికి తగ్గట్టుగానే  కొన్ని ఈవెంట్స్ లో తమన్నా, విజయ్ వర్మ విడివిడిగా కనిపించారు. బ్రేకప్ వార్తల తర్వాత ఈ ఇద్దరూ కలిసి కనిపించిందే లేదు. దాంతో ఈ ఇద్దరూ విడిపోయారని ఫ్యాన్స్ దాదాపు కన్ఫర్మ్ చేసుకున్నారు.

ఇది కూడా చదవండి : ఏం సినిమారా అయ్యా..! మెంటలెక్కి పోవాల్సిందే.. ఫ్యామిలీతో కలిసి చూడకపోవడం మంచిది

ఇక పోతే విజయ్ వర్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. నాని హీరోగా నటించిన ఎంసిఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాలో విలన్ గా నటించాడు. ఆతర్వాత మరో సినిమాలో నటించలేదు. అయితే ఇప్పుడు తమన్నాతో విడిపోయిన తర్వాత విజయ్ వర్మ ఇప్పుడు మరో హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు అని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి ఫాతిమా సన షేక్‌.. దంగల్ సినిమాతో ఈ చిన్నది పాపులర్ అయ్యింది. ఇటీవలే ఈ విజయ్ వర్మ, ఫాతిమా సన షేక్‌ లంచ్ కు వెళ్లిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో విజయ్ ను టైట్ గా హగ్ చేసుకోవడం.. అతనికి ముద్దుపెట్టడం వంటివి చేసింది. అంతే కాదు ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీస్తున్న కూడా అతనితో క్లోజ్ గా పోజులిచ్చింది. దాంతో ఇప్పుడు ఈ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు బీ టౌన్ లో చక్కర్లు కొడుతున్నాయి..

ఇది కూడా చదవండి : గుర్తుందా మావ..! అప్పట్లో టిక్ టాక్‌ను ఊపేసిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే