Allu Arjun: థియేటర్స్ షేక్ అవ్వాల్సిందే..! అల్లు అర్జున్ సినిమాలో స్టార్ హీరోయిన్ పవర్ ఫుల్ పాత్ర

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. మొన్నటివరకు టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పుష్ప సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలిచింది.

Allu Arjun: థియేటర్స్ షేక్ అవ్వాల్సిందే..! అల్లు అర్జున్ సినిమాలో స్టార్ హీరోయిన్ పవర్ ఫుల్ పాత్ర
Allu Arjun

Updated on: Aug 18, 2025 | 4:00 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతూన్నాడు. మొన్నటివరకు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా అంచనాలను మించి సంచలన విజయం సాధించింది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. బన్నీ ఊర మాస్ అవతార్ లో అదరగొట్టారు. అల్లు అర్జున్ నటనకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇక ఆతర్వాత విడుదలైన పుష్ప 2 సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. పుష్ప 2 సినిమా ఏకంగా రూ. 1000కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియాట్ చేసింది. ఇక ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్.

Bigg Boss 9: అబ్బో.. పెద్ద ప్లానే..! బిగ్ బాస్ హౌస్‌లోకి ట్రెండింగ్ జంట.. ఇక రచ్చ రచ్చే

మొన్నామధ్య అట్లీ సినిమా కు సంబందించిన ఓ వీడియో వదిలారు. ఆ వీడియోలో అల్లు అర్జున్ అట్లీ కలిసి హాలీవుడ్ మేకర్స్ ను కలవడం.. వీఎఫ్ఎక్స్ టీమ్ తో మాట్లాడటం చూపించారు. సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని ముఖ్యంగా సూపర్ హీరోల కాన్సెప్ట్ తో మూవీ ఉంటుందని ఓ వీడియో ద్వారా చెప్పకనే చెప్పారు మేకర్స్. దాంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమా పై ఇప్పటికే చాలా రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

అప్పుడు నెలకు రూ.500.. ఇప్పుడు రూ. 83కోట్లకు మహారాణి.. 44 ఏళ్ల వయసులోనూ అదే హాట్‌నెస్

అంతే కాదు అల్లు అర్జున్ కు జోడిగా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది.ఈ అమ్మడితో పాటు మరో ముగ్గురు హీరోయిన్స్ కూడా ఉంటారని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ సినిమాలో రమ్యకృష్ణ కూడా నటిస్తున్నారని ఇప్పుడు ఫిలిమ్ సర్కిల్స్ లో వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే రమ్యకృష్ణ చాలా మంది హీరోల సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించి మెప్పించారు. అలాగే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అట్లీ, అల్లు అర్జున్ సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తారని ఇన్ సైడ్ టాక్. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

చేసిన ఒకేఒక్క సినిమా రిలీజ్ కూడా కాలేదు.. కానీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా క్రేజీ బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.