AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prasanth Varma: ప్రశాంత్ వర్మ క్రేజీ ప్లాన్.. ఈ అమ్మడితో సూపర్ ఉమెన్ సినిమా

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సినిమాల ద్వారా పౌరాణిక కథల పాత్రలను కొత్త తరహాలో ఆడియెన్స్ కు చెబుతున్నారు. కొత్త తరాన్ని ఆకర్షించే సూపర్ హీరో పాత్రలుగా దేవుళ్లను పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే ‘హనుమాన్’ సినిమాతో ఇలాగే విజయం సాధించాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఆయన రిషబ్ శెట్టి నటిస్తున్న ‘జై హనుమాన్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Prasanth Varma: ప్రశాంత్ వర్మ క్రేజీ ప్లాన్.. ఈ అమ్మడితో సూపర్ ఉమెన్ సినిమా
Prasanth Varma
Rajeev Rayala
|

Updated on: Aug 14, 2025 | 2:12 PM

Share

ప్రశాంత్ వర్మ.. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తుంది. ఈ యంగ్ డైరెక్టర్ తెరకెక్కించే సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. అ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ప్రశాంత్ వర్మ. డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలు తెరకెక్కిస్తూ హిట్స్ అందుకుంటున్నాడు ఈ కుర్రదర్శకుడు. అ సినిమా తర్వాత రాజశేఖర్ హీరోగా కల్కి అనే సినిమా తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలాగే 2021లో వచ్చిన జాంబీ రెడ్డి సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన తేజ హీరోగా మారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక తమన్నా ప్రధాన పాత్రలో దట్ ఈజ్ మహాలక్ష్మీ అనే సినిమా చేశాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు.

Murali Sharma: ఇదేంది మావ..! ఈ హీరోయిన్ ఈయన భార్య.! అస్సలు ఊహించలేరు

ఇక ఈ ఏడాది హనుమాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలను లేకుండా వచ్చిన హనుమాన్ సినిమా ఏకంగా మూడు వందల కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో తేజ సజ్జ కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. హనుమంతుడి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు జై హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి

14 ఏళ్లల్లోనే ఎంట్రీ.. 300కి పైగా సినిమాలు.. ఇప్పటికీ అదే అందం.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

జై హనుమాన్ సినిమాతో హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. ఇటీవలే ఆయనకు సంబందించిన పోస్టర్ ను విడుదల చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో మరికొన్ని సినిమాలను కూడా తెరకెక్కించనున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. కాగా వాటిలో ఓ సూపర్ ఉమెన్ సినిమా కూడా ఉండనుంది. ఆ సినిమాలో హీరోయిన్ గా ఓ హాట్ బ్యూటీ నటిస్తుంది. ఆమె పేరు జ్ఞానేశ్వరి . ఈ అమ్మడు మిస్టర్ అండ్ మిస్, ఏమి సేతుర లింగ, మంత్ ఆఫ్ మధు సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడిని ప్రధాన పాత్రలో పెట్టి ప్రశాంత్ వర్మ ఓ సూపర్ ఉమెన్ సినిమా చేస్తున్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్నీ తెలిపింది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ హాట్ బ్యూటీ ఫోటోలకుకుర్రకారు ఫిదా అవుతున్నారు.

11ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్.. అప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఇప్పుడు ఎలా ఉందంటే..

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి