AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: మెగాస్టార్ నయా మూవీ టైటిల్ ఇదేనా.. డివోషనల్ టచ్‌తో సినిమా పేరు.!

టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు దర్శకులు. ముఖ్యంగా డివోషనల్ టచ్ ఉన్న పేర్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి టైటిల్ పెడితే సినిమాకు పవర్ వచ్చేస్తుంది. అందుకే బోయపాటి తన సినిమాలకు ఇదే ఫాలో అవుతుంటారు. అఖండ, వినయ విధేయ రామ, స్కంద అంటూ వరసగా దేవుడి పేర్లే పెట్టారీయన. తాజాగా చిరంజీవి, వశిష్ట సినిమాకు ఇదే చేయబోతున్నారు

Chiranjeevi: మెగాస్టార్ నయా మూవీ టైటిల్ ఇదేనా.. డివోషనల్ టచ్‌తో సినిమా పేరు.!
Mega157
Rajeev Rayala
|

Updated on: Oct 26, 2023 | 8:06 AM

Share

కథలో మాత్రమే పవర్ ఉంటే సరిపోదు.. టైటిల్‌లోనూ అంతే పవర్ ఉండాలి. ఈ విషయంలో దేవుడి కంటే పవర్ ఫుల్ ఎవరుంటారు చెప్పండి..? అందుకే మన దర్శకుల ఆలోచనలు అటు వైపు వెళ్తున్నాయి. తమ సినిమాలకు డివోషనల్ టైటిల్స్ పెడుతున్నారు. తాజాగా చిరంజీవి, వశిష్ట సినిమాకు ఇలాంటి టైటిలే పరిశీలిస్తున్నారు. మరి ఏ దేవుడి పేరుతో చిరు వస్తున్నారు..?

టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు దర్శకులు. ముఖ్యంగా డివోషనల్ టచ్ ఉన్న పేర్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి టైటిల్ పెడితే సినిమాకు పవర్ వచ్చేస్తుంది. అందుకే బోయపాటి తన సినిమాలకు ఇదే ఫాలో అవుతుంటారు. అఖండ, వినయ విధేయ రామ, స్కంద అంటూ వరసగా దేవుడి పేర్లే పెట్టారీయన. తాజాగా చిరంజీవి, వశిష్ట సినిమాకు ఇదే చేయబోతున్నారు.

ముల్లోకాల నేఫథ్యంలో సాగే సోషియో ఫాంటసీ కథ ఇది. దీనికి విశ్వంభర అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. సుప్రసిద్ధ రచయిత డాక్టర్ సి నారాయణరెడ్డి గారు రాసిన పుస్తకం ఇది. దీనికి భూమి, అతేంద్రీయ శక్తితో పాటు శ్రీ మహావిష్ణు ఇలా చాలా అర్థాలున్నాయి. కథకు ఇది పక్కాగా సూట్ అవుతుందని వశిష్ట భావిస్తున్నారు. మరోవైపు కార్తికేయతో హిట్ కొట్టిన నిఖిల్.. ఇప్పుడు స్వయంభుగా రాబోతున్నారు.

కార్తికేయ అంటే మణిఖంఠుడు. ఇప్పుడు శివుడి పేరైన స్వయంభుతో రానున్నారీయన. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. మరోవైపు దిల్ రాజు జఠాయు అనే భారీ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా చిరంజీవి సైతం విశ్వంభరగా వస్తే.. ఈ తరహా డివోషనల్ టైటిల్స్‌కు మరింత డిమాండ్ పెరగడం ఖాయం.

చిరంజీవి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..

చిరంజీవి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.