AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varanasi: వారణాసిలో మహేష్ రాముడు.. హనుమంతుడిగా ఆ స్టార్ హీరో..

మహేష్ బాబు ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్త వచ్చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటిస్తోన్న సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ గ్రాండ్ ఈవెంట్ జరిగింది. ఇదే ఈవెంట్ లో మహేష్- రాజమౌళి సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు

Varanasi: వారణాసిలో మహేష్ రాముడు.. హనుమంతుడిగా ఆ స్టార్ హీరో..
Varanasi
Rajeev Rayala
|

Updated on: Nov 18, 2025 | 8:02 PM

Share

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబల్ మూవీ వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవలే ఈ సినిమా టైటిల్ తోపాటు మహేష్ బాబు లుక్ ను కూడా విడుదల చేశారు. ఈమేరకు భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు భారీగా అభిమానులు తరలి వచ్చారు. అలాగే మహేష్ బాబు ఎంట్రీ కూడా అదిరిపోయింది. నంది పై మహేష్ బాబు త్రిశలం పట్టుకొని ఎంట్రీ ఇచ్చారు. దానికి ఫ్యాన్స్ కు పిచ్చెక్కిండిపోయింది. ఇక మూవీ టైటిల్ టీజర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చింది.

ఇది కూడా చదవండి : ఆమె నా సినిమాలో చేయకపోవడమే మంచిదైంది.. స్టార్ హీరోయిన్ పై రాజమౌళి

ఇక ఈ సినిమా ఎలా ఉంటుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ ను డీకోడ్ చేసే పనిలో ఉన్నారు. అసలు సినిమా కథ ఏమై ఉంటుందా అని ఆరాలు తీస్తున్నారు. ఇదిలా ఉంటే వారణాసి సినిమాలో మహేష్ బాబు రాముడిగా కనిపిస్తాడు అని రాజమౌళి ఇప్పటికే హిట్ ఇచ్చారు. మహేష్ బాబు రాముడి గెటప్ లో అద్భుతంగా ఉన్నాడు అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో హనుమంతుడిగా ఓ స్టార్ హీరో నటిస్తున్నాడని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : రెండే రెండు సినిమాలు హిట్. మిగిలినవన్నీ ఫ్లాప్.. దెబ్బకు మాయం అయ్యింది

ఆ హీరో ఎవరో కాదు కన్నడ స్టార్ హీరో సుదీప్. హనుమంతుడి పాత్రలో కన్నడ హీరో సుదీప్ నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాలో సుదీప్ విలన్ గా నటించాడు. అలాగే బాహుబలి సినిమాలోనూ చిన్న పాత్రలో కనిపించాడు. ఇక ఇప్పుడు వారణాసి సినిమాలో హనుమంతుడిగా సుదీప్ కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈవార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

ఇది కూడా చదవండి : ఇది కదా సినిమా అంటే..! పెట్టింది రూ. 16 కోట్లు.. వచ్చింది రూ.400కోట్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.