Hyper Aadi: బ్యాచిలర్ లైఫ్‌కు బైబై చెప్పునున్న హైపర్ ఆది.. ఆ యాంకర్‌తో ఏడడుగులు నడవనున్న స్టార్ కమెడియన్
ప్రస్తుతం బుల్లితెరపై అతనిదే హవా. పలు టీవీ షోలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇక కేవలం బుల్లితెరపైనే కాకుండా సిల్వర్ స్క్రీన్ పైనా మెరుస్తున్నాడు ఆది. గతేడాది భీమ్లా నాయక్, ధమాకా సినిమాల్లో మెరిసిన ఆది ఈ ఏడాది..

హైపర్ అది.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ మాత్రం పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర కామెడీ షోల్లో ఆది వేసే పంచులు, సెటైర్లకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం బుల్లితెరపై అతనిదే హవా. పలు టీవీ షోలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇక కేవలం బుల్లితెరపైనే కాకుండా సిల్వర్ స్క్రీన్ పైనా మెరుస్తున్నాడు ఆది. గతేడాది భీమ్లా నాయక్, ధమాకా సినిమాల్లో మెరిసిన ఆది ఈ ఏడాది ధనుష్ సర్, విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ, రవితేజ రావణాసుర మూవీస్‌లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం చిరంజీవితో భోళా శంకర్, అలాగే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాల్లో నటిస్తున్నాడు. కాగా ప్రస్తుతం టీవీ షోస్, సినిమాలతో బిజీబిజీగా ఉన్న హైపర్ ఆది త్వరలోనే తన బ్యాచిలర్ లైఫ్‌కు బైబై చెప్పనున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఓ ప్రముఖ యాంకర్‌తో ఆది ఏడడుగులు నడవనున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరిద్దరికి చాలా కాలం నుంచేపరిచయం ఉందట. ఆది కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి ఆమె సపోర్టుగా నిలిచిందట. మొదట ఫ్రెండ్స్ గా ఉన్న ఈ జోడీ ఆ తర్వాత మనసులు కలవడంతో ప్రేమికులుగా మారారట. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు కూడా ఆశీర్వాదం తెలిపారని, పెళ్లి బాజాలు మోగడమే తరువాయి అని సమాచారం.
అయితే ఆది పెళ్లి వ్యవహారంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడం లేదు. మరోవైపు రాబోయే రోజుల్లో ఆదినే తనకు కాబోయే భార్యను రిచయం చేస్తాడని తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాదే ఆది వైవాహిక బంధంలోకి అడుగుపెట్టే సూచనలున్నాయని తెలుస్తోంది. కాగా సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉంటున్నాడు ఆది. పవన్ కల్యాణ్‌ను అమితంగా ఆరాధించే ఆయన జనసేన పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ముఖ్యంగా పవన్‌ను కానీ, జనసేనను విమర్శించే వారికి తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..



