BRO Movie: ‘బ్రో’ మూవీలో సాయి ధరమ్ తేజ్ చెల్లిగా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటంటే..
తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న వినోదయ సీతమ్ సినిమాకు తెలుగు రీమేక్ గా డైరెక్టర్ సముద్రఖని ఈ మూవీని రూపొందించారు. అయితే ఈ సినిమాకు డైలాగ్స్.. స్క్రీన్ ప్లే దగ్గరుండి చూసుకున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. జూలై 28న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు పాజిటివ్‌తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అయితే ఈ సినిమాలో పవన్, సాయి తేజ్ తోపాటు ఓ అమ్మాయి కూడా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బ్రో దూసుకుపోతుంది. మొదటిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి రెండు రోజుల్లోనే దాదాపు రూ.70 లక్షల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ఈ చిత్రం. తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న వినోదయ సీతమ్ సినిమాకు తెలుగు రీమేక్ గా డైరెక్టర్ సముద్రఖని ఈ మూవీని రూపొందించారు. అయితే ఈ సినిమాకు డైలాగ్స్.. స్క్రీన్ ప్లే దగ్గరుండి చూసుకున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. జూలై 28న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు పాజిటివ్‌తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అయితే ఈ సినిమాలో పవన్, సాయి తేజ్ తోపాటు ఓ అమ్మాయి కూడా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇంకేముంది ఇప్పుడు నెట్టింట ఆ అమ్మాయి ఎవరా అని సెర్చింగ్ స్టార్ట్ చేశారు నెటిజన్స్.
బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన కేతిక శర్మ కథానాయికగా అలరించింది. ఇక అతనికి ఇద్దరు చెల్లెళ్లు.. ఒక తమ్ముడు ఉంటారు. అందులో ఒక చెల్లి ప్రియా ప్రకాష్ వారియర్ కాగా.. మరో సిస్టర్ గాయత్రి(యువలక్ష్మి.)ఇందులో మార్కండేయ (సాయి తేజ్)కు తన చెల్లెలు యువలక్ష్మి అంటే చాలా ఇష్టముంటుంది. నిజానికి ఈ సినిమాలో ఆమె పాత్రకే ఎక్కువ స్కోప్ ఉందనే చెప్పాలి. ఈ చిత్రంలో అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది యువలక్ష్మి. బ్రో చిత్రంలో మామ అల్లుడితోపాటు ఈ అమ్మాయి సైతం ఫేమస్ అయ్యింది.




యువలక్ష్మి చాలా మందికి తెలియదు. కానీ ఇప్పటికే అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. బాలనటిగా కెరీర్ ఆరంభించిన ఈ చిన్నది.. తమిళంలో సముధ్రఖని , అమలా పాల్ కలిసి నటించిన అమ్మ కనక్కు సినిమాలో వారి కూతురిగా కనిపించింది. టీవీలో అనేక చిన్న పిల్లల షోలలో కనిపించింది. అలాగే కాంచన 3, వినోదయ సీతమ్ సినిమాల్లో నటించింది. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. తమిళంలో ఎక్కువ సినిమాలు చేసిన ఆమె.. ఇప్పుడు బ్రో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. చూడాలి మరీ.. ఈమూవీ తర్వాత తెలుగులో ఈ బ్యూటీ బిజీ కానుందేమో.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




