AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ నుంచి హరిత హరీష్ అవుట్.. నాలుగు వారాలకు ఎంత రెమ్యునరేషన్ అందుకున్నాడంటే

బిగ్ బాస్ సీజన్ 9.. నాలుగో వారం ఎలిమినేషన్ పై ఆసక్తి నెలకొంది. ఈసారి కామనర్స్ నుంచి హరీష్ ఎలిమినేట్ అయ్యాడని సమాచారం. మరోవైపు శనివారం నాటి ఎపిసోడ్ లో హౌస్మేట్స్ కు చుక్కలు చూపించాడు నాగ్. ఒక్కొక్కరి స్టార్స్ ఇస్తునే గట్టిగానే గడ్డి పెట్టాడు.. హౌస్మేట్ ఆట తీరు గురించి చెబుతూ.. మంచిగా ఆడే వాళ్లకు సపోర్ట్ చేశారు.

బిగ్ బాస్ నుంచి హరిత హరీష్ అవుట్.. నాలుగు వారాలకు ఎంత రెమ్యునరేషన్ అందుకున్నాడంటే
Bigg Boss 9
Rajeev Rayala
|

Updated on: Oct 05, 2025 | 7:30 PM

Share

బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా మారింది. హౌస్ మేట్స్ మధ్య గొడవలు, ఏడుపులు, మాటల యుద్దాలు తార స్థాయికి చేరాయి. ఇక వారాంతంలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు హౌస్ మేట్స్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. చివరి వారంలో ప్రియా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఆమె పై వచ్చిన నెగిటివిటీని ఆమె ఎలిమినేషన్ కు కారణం అయ్యింది. ఇక ఇప్పుడు హౌస్ నుంచి మరో కామనర్ బయటకు రానున్నాడని తెలుస్తుంది. హౌస్ లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు.. హరిత హరీష్. కామనర్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన హరిత హరీష్. ఈ వారం హౌస్ నుంచి బయటకు రానున్నడని తెలుస్తుంది.

ఈ ఫొటోలో ఉన్న అన్న చెల్లెల్లు.. ఇప్పుడు టాలీవుడ్ హీరో, హీరోయిన్స్.. ఎవరో తెలుసా.?

నిన్నటి ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున హౌస్ మేట్స్ కు ఓ రేంజ్ లో క్లాస్ తీసుకున్నారు. కంటెస్టెంట్స్‌కి పెర్ఫామెన్స్ ఆధారంగా గోల్డ్, సిల్వర్, బ్లాక్ స్టార్లు ఇచ్చారు నాగార్జున. మొదటిగా గోల్డెన్ స్టార్‌ని ఇమ్మానుయేల్ ఇచ్చారు నాగార్జున. ఇమ్మానుయేల్ ఆకాశానికి ఎత్తేశారు కింగ్ నాగార్జున. శ్రీజాకి సిల్వర్ స్టార్ ఇచ్చి.. నువ్వు ఇంప్రూవ్ అవ్వాలని అన్నారు. నాగార్జున. ఆతర్వాత సుమన్ శెట్టిని లేపి నువ్వు గోల్డ్ స్టార్‌కి దగ్గరగా ఉన్నావ్.. నీ బలం నీకు అర్థం కావడం లేదు అని సుమన్ కు బూస్ట్ ఇచ్చాడు నాగ్.

ఒకే ఒక్క డిజాస్టర్ పడింది..! దెబ్బకు ఏడాదికి పైగా కనిపించకుండా పోయింది..

బిగ్ బాస్ లో ముఖ్యంగా సంజనాపై హరీష్ చేసే కామెంట్స్.. ఆడియన్స్ కు చిరాకు వచ్చింది. ఈవారంలో ఇమ్మానుయేల్, భరణి, సుమన్ శెట్టిలు నామినేషన్స్‌లో లేకపోవడంతో వాళ్ల ఓట్లు షేరింగ్ ఫ్లోరాకి పాజిటివ్‌గా మారింది. ఓట్ల ప్రకారం చూసుకుంటే హరిత హరీష్ కు తక్కువ ఓట్లు పడ్డాయి. చివరిగా శ్రీజా, హరీష్ పోటీపడ్డారు. శ్రీజ కంటే హరీష్ కు ఓట్లు తగ్గడంతో.. ఈవారం హౌస్ నుంచి హరీష్ బయటకు వచేస్తున్నాడని తెలుస్తుంది. ఇక నాలుగు వారాలకు గాను హరీష్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నాడంటే.. హరీష్‌కు వారానికి రూ. 60 వేల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా హరీష్ కు రూ 2,40,000 అందినట్టు తెలుస్తుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..