Vijay Deverakonda: పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ.. ఘన స్వాగతం ట్రస్ట్ సభ్యులు
హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లు నిశ్చితార్థం ఇటీవలే జరిగింది. శుక్రవారం (అక్టోబర్ 03) ఉదయం విజయదేవరకొండ ఇంట్లో ఈ శుభాకార్యం జరిగిందని తెలుస్తుంది. అయితే అత్యంత గోప్యంగా ఈ ఎంగజ్మెంట్ వేడుక నిర్వహించినట్లు తెలుస్తోంది. కేవలం ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో విజయ్-రష్మికల ఉంగరాలు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ హిట్ పెయిర్.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నిన్న వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని విజయ్ స్వగృహంలో జరిగింది. రెండు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహానికి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది.‘గీత గోవిందం’ సినిమాలో కలిసి నటించిన వీరు హిట్ పెయిర్‌గా నిలిచారు. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’లోనూ నటించారు. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్టు పలుమార్లు వార్తలు రాగా తాము స్నేహితులం మాత్రమేనని చెబుతుండేవారు.
అయినా పలు వేడుకలకు కలిసి వెళ్లడంతో రూమర్స్ వస్తూనే ఉండేవి. ఇప్పుడు అభిమానులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చినట్టైంది. టాలీవుడ్‌లో ఎప్పటినుంచో చక్కర్లు కొడుతున్న ప్రేమ ప్రచారానికి వీరు తెరదించారు. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే కాదని స్పష్టం చేస్తూ, ఈ జంట ఒకరికొకరు ఉంగరాలు మార్చుకున్నారు. ఇరు కుటుంబాల పూర్తి అంగీకారంతో నిశ్చితార్థ వేడుకను చాలా ప్రైవేట్‌గా నిర్వహించారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్‌లో నటిస్తున్నారు.
కాగా తాజాగా సత్యసాయిబాబా మహాసమాధి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి వెళ్లారు విజయ్ దేవరకొండ. శాంతిభవన్లో విజయ దేవరకొండకి సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులు, టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు విజయ్ దేవరకొండ.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




