- Telugu News Photo Gallery Cinema photos Sasivadane Movie Heroine Komalee Prasad Stunns In Traditional Dress, See Photos
Komalee Prasad: చుడీదార్‌లో ‘శశివదనే’ హీరోయిన్.. ట్రెడిషినల్ డ్రెస్‌లో కోమలి ప్రసాద్ ఎంత అందంగా ఉందో చూశారా?
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కోమలి ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఓ వైపు ‘హిట్-3’ వంటి సినిమాల్లో సహాయక నటిగా మెప్పిస్తూనే హీరోయిన్ గానూ అదృష్టం పరీక్షించుకుంటోందీ అందాల తార. ఇప్పుడీ అమ్మడు మెయిన్ లీడ్ లో నటిస్తోన్న శశివదనే సినిమా రిలీజ్ కు ముస్తాబైంది.
Updated on: Oct 05, 2025 | 6:50 PM

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ హీరో, హీరోయిన్లు గా నటించిన తాజా చిత్రం 'శశివదనే'. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి.

ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న 'శశివదనే' సినిమా అక్టోబర్ 10న థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయ్యింది. దీంతో ఈ మూవీ ప్రమోషన్లలో చిత్ర బృందం బిజి బిజీగా ఉంటోంది.

హీరో, హీరోయిన్లు కూడా తమ సినిమా ప్రమోషన్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా శశివదనే సినిమా ప్రెస్‌మీట్‌లో కోమలి ప్రసాద్ చుడిదార్‌లో సందడి చేసింది.

శశివదనే' సినిమాలో కోమలీ ప్రసాద్ గోదావరి అమ్మాయి పాత్రలో నటించింది. అందులో భాగంగా ఎక్కువగా లంగా ఓణీలు, చీరల్లోనే కనిపించింది.

కాగా కోమలి ప్రసాద్ హీరోయినే కాదు డాక్టర్ కూడా. శాఖపట్నంలో పుట్టి పెరిగిన ఈ అందాల తార మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లోని ప్రవర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో మెడిసిన్ పూర్తి చేసింది

హిట్ 3 తర్వాత కథానాయికగా ఈ అమ్మడికి అవకాశాలు పెరిగాయి. ఇప్పుడు తమిళంలోనూ ఓ సినిమా చేస్తోంది కోమలి ప్రసాద్. ఇందులో కూడా ఆమె హీరోయిన్ రోల్ పోషిస్తోంది.




