- Telugu News Photo Gallery Cinema photos Actress Reba Monica John Attended Navratri Celebrations With Husband, See Photos
Reba Monica John: ‘కూలీ’ ఫేమ్ రెబా మోనికా జాన్ భర్త ఎవరో తెలుసా? లవ్లీ కపుల్ రొమాంటిక్ ఫొటోస్ వైరల్
సామజవరగమన సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు తెగ నచ్చేసింది రెబా మోనికా జాన్. ఇందులో ఆమె అందం, నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత 'మ్యాడ్ స్క్వేర్’ సినిమాలో స్వాతిరెడ్డి పాటతో కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది. అయితే ఈ నటిది ప్రేమ వివాహమని చాలా మందికి తెలియదు.
Updated on: Oct 05, 2025 | 5:17 PM

దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో కేరళలోని త్రిసూర్‌లో నవరాత్రి సెలబ్రేషన్స్ జరగ్గా పలువురు సినీ ప్రముఖులు కూడా సందడి చేశారు.

ముఖ్యంగా మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇదే వేడుకకు 'కూలీ' ఫేమ్ రెబా మోనికా జాన్ కూడా వచ్చింది. భర్త జోమన్‌తో కలిసి ఈ వేడుకల్లో సందడి చేసిందీ అందాల తార.

ఇందుకు సంబంధించిన ఫొటోల‍్ని రెబా భర్త తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ వేడుకల్లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

కాగా శ్రీ విష్ణు నటించిన సామజవరగమన సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది రెబా మోనికా జాన్. అలాగే మ్యాడ్ స్క్వేర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది.

సినిమాల సంగతి పక్కన పెడితే.. రెబా మోనికా జాన్ ది ప్రేమ వివాహం. జోమాన్ జోసెఫ్ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందీ అందాల తార. 2022లో వీరి వివాహం జరిగింది.

ఇక రెబా మోనికా జాన్ భర్త జోమాన్ జోసెఫ్ విషయానికి వస్తే.. ఒక ఎమ్మెన్సీ కంపెనీలో కన్సల్టెంట్ గా పని చేస్తున్నాడు. అలాగే కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి.




