- Telugu News Photo Gallery Cinema photos Megastar Chiranjeevi Shares 80's Reunion Photos Venkatesh and Jayasuda, Suhasini
Megastar Chiranjeevi: 80’s రీయూనియన్.. అందమైన జ్ఞాపకాలంటూ ఫోటోస్ షేర్ చేసిన చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అటు విశ్వంభర, ఇటు మన శంకరవరప్రసాద్ గారు సినిమాల షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో 80's రీయూనియన్ ఫోటోస్ షేర్ చేస్తూ అందమైన జ్ఞాపకాలంటూ రాసుకొచ్చారు.
Updated on: Oct 05, 2025 | 1:23 PM

80'sలో భారతీయ సినిమా ప్రపంచాన్ని శాసించిన తారలు అనేక మంది ఉన్నారు. అటు ఉత్తరాది, ఇటు దక్షిణాదికి చెందిన నటీనటులు అందరూ ఇప్పుడు ఒకేచోట కలిశారు. ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

2. మొత్తం 31 మంది స్టార్స్ కలిసి అక్టోబర్ 4న చెన్నైలో పార్టీ చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా (#80sStarsReunion) అలనాటి తారలు ప్రతి సంవత్సరం రీయూనియన్ వేడుకలు నిర్వహించుకుంటున్న సంగతి తెలిసిందే. గతేడాది వీరి రీయూనియన్ జరగాల్సి ఉండగా.. చెన్నైలో వరదల కారణంగా వాయిదా పడింది.

ఇక ఇప్పుడు మరోసారి (#80sStarsReunion) రీయూనియన్ అయ్యారు. ఈవేడుకలో తారలంతా అలనాటి విశేషాలను, జ్ఞాపకాలను పంచుకున్నారు. వెంకటేశ్, చిరంజీవి, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, రాజ్‌కుమార్ సేతుపతి, నరేశ్, సుప్రియ, నదియ, రాధ, రమ్యకృష్ణ, సుమలత, జయసుధ, శోభన సందడి చేశారు.

ఈ ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి షేర్ చేస్తూ.. ఇవి ఎప్పటికీ అందమైన జ్ఞాపకాలని పేర్కొన్నారు. 80ల నాటి నా ప్రియమైన స్నేహితులతో ప్రతి రీయూనియన్ ఎప్పటికీ మర్చిపోలేను. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ బంధం విడదీయరానిది. ఎన్నో అందమైన జ్ఞాపకాలు.. మరెన్నో నవ్వులతో ఈ వేడుక ఆనందంగా సాగింది అంటూ రాసుకొచ్చారు.

ప్రస్తుతం చిరు షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ప్రతిసారి మొదటి సమావేశంలాగే ఉంటుందని రాసుకొచ్చారు చిరు. ఇదిలా ఉంటే..ఒకప్పుడు స్టార్ హీరోహీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన ఈ తారలు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అలరిస్తున్నారు.




