Harish Shankar: మరోసారి ఆ హీరోతో సినిమా చేయనున్న హరీష్ శంకర్.. పవన్ తర్వాత అతడే
గద్దల కొండ గణేష్ సినిమా తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చిన హరీష్ ఇప్పుడు మరోసారి పవర్ స్టార్ తో చేతులు కలిపారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వస్తోన్న విషయం తెలిసిందే.

పవర్ స్టార్ అభిమానులకు మెమరబుల్ గిఫ్ట్ గబ్బర్ సింగ్ ఇచ్చిన హరీష్ శంకర్ ఇప్పుడు మరోసారి పవన్తో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. గద్దల కొండ గణేష్ సినిమా తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చిన హరీష్ ఇప్పుడు మరోసారి పవర్ స్టార్ తో చేతులు కలిపారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచినా తేరి సినిమాను రీమేక్ చేస్తున్నారు హరీష్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమానుంచి ప్రీ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సినిమా పై అంచనాలు పెంచేసింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ మాస్ మహారాజ రవితేజతో సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. హరీష్ శంకర్ రవితేజ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యారు. షాక్ సినిమాతో హరీష్ శంకర్ దర్శకుడిగా మారారు. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో మిరపకాయ్ సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది.
ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మరో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలను లైనప్ చేసి బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్న రవితేజ.. ఇప్పుడు రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాల తర్వాత హరీష్ శంకర్ తో సినిమా చేయనున్నారని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ ఆవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.




