Adipurush: హనుమాన్ జయంతి సందర్భంగా ఆదిపురుష్ నుంచి కొత్త పోస్టర్
ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా కట్టుకున్నాయి. ఇటీవలే శ్రీనామ నవమి కానుకగా ఈ సినిమానుంచి సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా కట్టుకున్నాయి. ఇటీవలే శ్రీరామ నవమి కానుకగా ఈ సినిమానుంచి సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో సీతగా బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ నటిస్తోంది. ఇక రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. తాజాగా ఆదిపురుష్ సినిమానుంచి పోస్టర్ ను రిలీజ్ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.
నేడు హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఆదిపురుష్ నుంచి హనుమంతుడి పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. హనుమాన్ ధ్యానంలో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో బ్యా గ్రౌండ్ లో ప్రభాస్ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా సలార్. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు. దాంతో ఆదిపురుష్ కంటే ముందే సాలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలుస్తోంది.
View this post on Instagram




