Adipurush: ఏ క్షణాన మొదలెట్టారో ఏమో..! మరో వివాదంలో ఆదిపురుష్‌.. అసలు రిలీజ్ అవుతుందా అనే డౌట్..?

Adipurush: ఏ క్షణాన మొదలెట్టారో ఏమో..! మరో వివాదంలో ఆదిపురుష్‌.. అసలు రిలీజ్ అవుతుందా అనే డౌట్..?

Anil kumar poka

|

Updated on: Apr 06, 2023 | 9:03 AM

ఆదిపురుష్ సినిమాను ఏ క్షణాన మొదలెట్టారో కానీ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు వివాదాలకు కేరాఫ్‌గా ఉంటూ వస్తోంది. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూనే ఉంది. ఈ సినిమాకి వ్యతిరేకంగా పోలీస్‌ స్టేషన్లో కంప్లైట్స్ వచ్చేలా చేసుకుంటూనే ఉంది.

ఆదిపురుష్ సినిమాను ఏ క్షణాన మొదలెట్టారో కానీ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు వివాదాలకు కేరాఫ్‌గా ఉంటూ వస్తోంది. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూనే ఉంది. ఈ సినిమాకి వ్యతిరేకంగా పోలీస్‌ స్టేషన్లో కంప్లైట్స్ వచ్చేలా చేసుకుంటూనే ఉంది. ఇక తాజాగా శ్రీరామ నవమి కానుకగా రిలీజ్ అయిన ఆదిపురుష్‌ నయా పోస్టర్‌ కూడా.. ఇప్పుడో కొత్త ఇష్యూను తెరపైకి తెచ్చింది. మరో సారి ఈ మూవీ టీంను తలలు పట్టుకునేలా చేస్తోంది. ఎస్ ! బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్ డైరెక్షన్లో.. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కతున్న ఇండియన్ మైథలాజికల్‌ ఫిల్మ్ ఆదిపురుష్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈసినిమా రామాయణ ఇతివృత్తంతో.. మోషన్ క్యాప్చర్ టెక్నాలిజీతో రూపొందుతోంది. జూన్ 16న రిలీజ్‌కు కూడా రెడీ అయిపోయింది. ఇక తాజాగా మార్చ్‌ 30 న రిలీజ్ చేసిన ఆదిపురుష్‌ పోస్టర్‌లో.. సీత అలియాస్ కృతి సనన్‌కు మెట్టెలు లేకపోవడం..! రాముడితో సహా.. లక్ష్మణుడి వేషధారణ సంప్రదాయానికి విరుద్దంగా ఉండడంతో..! ఇప్పుడీ సినిమాకు వ్యతిరేకంగా.. ముంబైలోని సాకనాకి పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదైంది. ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో.. పోలీసులు ఈ మూవీ మేకర్స్ పై కేసు నమోదు చేయడం.. ఇప్పడు అంతటా మరో హాట్ టాపిక్‌ గా మారింది. ఈ సినిమాపై మరోసారి హిందువులు సీరియస్ అయ్యేలా చేసింది. ఈ సినిమా రిలీజ్ అడ్డుకోవాలనే పిలువ మరో సారి వచ్చేలా చేసుకుంటోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Published on: Apr 06, 2023 09:00 AM