NBK108: నటసింహంతో తలపడేందుకు ఆ వర్సటైల్ యాక్టర్‌ను కూడా దింపుతున్నారా..?
నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది అఖండ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశారు బాలయ్య. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna)సినిమా కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది అఖండ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశారు బాలయ్య. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బోయపాటితో కలిసి బాలయ్య అఖండ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు. ఈ మూవీ మంచి హిట్ అందుకోవడమే కాకుండా భారీగా వసూళ్లు కూడా రాబట్టింది. దాంతో ఇప్పుడు బాలయ్య నెక్స్ట్ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. నటసింహం ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ మధ్య క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు గోపీచంద్ మలినేని. మాస్ మహారాజ రవితేజ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాలయ్య కెరీర్ లో ఈ మూవీ 107వ సినిమా. ఈ సినిమాలో అందాల భామ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
అలాగే ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో వర్సటైల్ యాక్టర్ అరవింద్ స్వామి కీలక పాత్రలో నటిస్తున్నారట. గతంలో హీరోగా నటించిన ఆయన ఇటీవల విలన్ పాత్రల్లోనూ మెప్పిస్తున్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ధ్రువ సినిమాలో అరవింద్ స్వామి విలన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాలయ్య సినిమాలో కూడా అరవింద్ స్వామి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటటైనర్ గా తెరకెక్కిస్తున్నారు గోపీచంద్ మలినేని. ప్రస్తుతం ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమానుంచి కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.