మరోసారి మంగపతిలాంటి పాత్ర..! స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకున్న శివాజీ
బిగ్ బాస్ సీజన్ 7 తో శివాజీ మరోసారి ప్రేక్షకుల నోర్లలో నానారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న శివాజీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7తో ప్రేక్షకులను పలకరించారు. ఆ మధ్య రాజకీయాల్లో యాక్టివ్ గా కనిపించిన శివాజీ ఆతర్వాత సైలెంట్ అయ్యారు. ఇక బిగ్ బాస్ హౌస్‌లో శివాజీ ప్రేక్షకులను అలరించారు. హౌస్ కు పెద్దమనిషిగా అందరికి సలహాలు సూచనలు ఇస్తూ ఫైనలిస్ట్ అయ్యారు.

శివాజీ.. బిగ్ బాస్ తో మరో సారి ఈయన పేరు మరు మ్రోగింది. ఒకప్పుడు హీరోగా రాణించారు శివాజీ. శివాజీ కామెడీ టైమింగ్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు శివాజీ.. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసిన శివాజీ ఆతర్వాత సెకండ్ హీరోగా..క్రమంగా ప్రధాన పాత్రలు చేసి మెప్పించాడు. అయితే ఆతర్వాత శివాజీకి ఇండస్ట్రీలో బ్రేక్ వచ్చింది. ఆ మధ్య రాజకీయాల్లోనూ కనిపించారు. ఇక చాలా కాలం తర్వాత బిగ్ బాస్ లో కనిపించారు. బిగ్ బాస్ గేమ్ షోతో శివాజీకి మరోసారి మంచి క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన 90’s బయోపిక్ సిరీస్ లో నటించి మెప్పించారు.
ఇది కూడా చదవండి : జిమ్‌కు వెళ్లడం మానేశా.. ఆ పని చేసి బరువు తగ్గా.. సీక్రెట్ రివీల్ చేసిన స్టార్ హీరోయిన్
ఇక ఇటీవల నేచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్ట్ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించారు శివాజీ. కోర్ట్ సినిమాలో మంగపతి పాత్రలో అదరగొట్టారు. కోర్ట్ సినిమా తర్వాత శివాజీ పేరు మరోసారి ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది. ఈ క్రమంలోనే ఆయన మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకున్నాడని తెలుస్తుంది. అక్కినేని అఖిల్ నటిస్తున్న నయా మూవీలో శివాజీ కీలక పాత్రలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.
ఇది కూడా చదవండి : ఒకప్పుడు యాంకర్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..! ఒక్క సినిమాకు రూ.25కోట్లు తీసుకుంటున్న బ్యూటీ
లెనిన్ సినిమాలో శివాజీ రోల్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని టాక్. మరోసారి ఆయన నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారని అంటున్నారు. కోర్ట్ లోని మంగపతి తరహా పాత్రలో శివాజీ కనిపిస్తారని అంటున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. అఖిల్ సినిమాలో శివాజీ ఛాన్స్ అందుకుంటే.. మరోసారి శివాజీ టాలీవుడ్ లో బిజీ అవ్వడం ఖాయం అంటున్నారు అభిమానులు.. శివాజీ లాంటి నటులు వరుసగా సినిమాలు చేయాలనీ ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
ఇది కూడా చదవండి : అందంగా లేదని అప్పుడు అవమానించారు.. కట్ చేస్తే ఇప్పుడు అదే బ్రాండ్‌కు అంబాసిడర్‌గా
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








